Ponnam Prabhakar: తెలంగాణ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. వీఆర్ఏల డిమాండ్లను ప్రభుత్వం పదిరోజుల్లో పరిష్కరించాలని కోరారు. తేదీ 24 ఫిబ్రవరి 2017 మహాశివరాత్రి పండగ రోజున రోజున ప్రగతి భవన్ సాక్షిగా, మంత్రుల సాక్షిగా, ఉన్నత అధికారుల సాక్షిగా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన మీరు గ్రామ రెవెన్యూ సహాయకులకు (VRA) ఇచ్చిన హామీలైన అర్హులైన వారికి పదోన్నతులు కల్పిస్తామని, పేస్కేలు కల్పించి క్రమబద్ధీకరణ చేస్తామని, 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగం కల్పిస్తామని మరియు వీఆర్ఏల సొంత గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నేటికీ 5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ మీరు ఇచ్చిన హామీలు అమలు కాలేదని లేఖలో పేర్కొన్నారు. తరువాత 2020 సెప్టెంబర్ 9 రోజున అసెంబ్లీ సాక్షిగా రెవెన్యూ చట్టం ప్రవేశపెడుతూ వీఆర్ఏ లు అందరికీ పే స్కేలు కల్పించి క్రమబద్ధీకరణ చేస్తామని వారి డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రకటించి నేటికీ 22 నెలలు గడచినా మీ హామీలు అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు.
Read also: goods train derailed: పట్టాలు తప్పి వెయిటింగ్ హాల్లోకి దూసుకెళ్లిన గూడ్స్ రైలు.. ముగ్గురు మృతి
దీనివల్ల వీఆర్ఏలు తమకు ఉద్యోగ భద్రత లేక, పదోన్నతులు లేక వీఆర్వో వ్యవస్థ రద్దుతో పెరిగిన పని భారం, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు వంటి కారణాలతో కొంతమంది వీఆర్ఏలు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు. విధి నిర్వహణలో మరికొందరు మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జిల్లా కలెక్టరేట్ ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టి, రాష్ట్ర మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మీ ఆదేశాల మేరకు అక్టోబర్ 12వ తేదీన వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి వారి డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని, మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉన్నందున కోడ్ ముగిసిన తర్వాత మీ సమస్యలను పరిష్కరిస్తామని డిమాండ్లను నెరవేర్చుతామని, వీఆర్ఏలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రతినిధిగా హాజరైన రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ తెలియజేశారు, ఈ మేరకు మూడు నెలలుగా సమ్మె చేపట్టిన వీఆర్ఏలు సమ్మె విరమించుకొని విధులకు హాజరు కావడం జరిగింది.
Read also: Chikoti Casino Case: క్యాసినో కేసులో నేడు ఈడీ ముందుకు దేవేందర్ రెడ్డి, తలసాని పీఏ హరీష్
మునుగోడు ఎన్నికల ఫలితాలు వెలువడి నెల రోజులు గడిచినప్పటికీ ఈనెల ఏడవ తేదీన వీఆర్ఏలతో చర్చలు జరుపుతామని గతంలో ప్రకటించిన ప్రభుత్వం 20వ తేదీ వచ్చినప్పటికీ ఇప్పటివరకు వీఆర్ఏలతో చర్చలు జరుపకపోవడం కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మంత్రి కేటీఆర్ కానీ, సిఎస్ సోమేష్ కుమార్ కాని, వీఆర్ఏలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం, వీఆర్ఏలు విధులకు హాజరై నెల రోజులు గడిచినప్పటికీ వారికి జీతభత్యాలు కూడా చెల్లించకపోవడం శోచనీయమన్నారు. ఇది కేవలం మునుగోడు ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికలలో వీఆర్ఏల సేవలను వినియోగించుకుని, వారిని ఎన్నికల ఓటు బ్యాంకుగా వాడుకునే ఉద్దేశంతోనే చేసిన ప్రకటనగా మిగిలిపోయింది. ఎన్నికల కోడ్ ముగిసి నెల రోజులు గడిచినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం వీఆర్ఏలతో చర్చలు జరుపకపోవడం వారి డిమాండ్ల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టకపోవడం పట్ల ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయి వీఆర్ఏలు మరోసారి అభద్రతా భావంతో జీవనం వెళ్లదీస్తున్నారు. కావున ఇప్పటికైనా నేటి నుండి 10 రోజుల్లో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలని, సిఎస్ సోమేశ్ కుమార్ గారు వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకొని వెంటనే చర్యలు చేపట్టాలని, మానవతా దృక్పథంతో ఆలోచించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ముఖ్యమంత్రి కెసీఆర్ కు పొన్నం ప్రభాకర్ గౌడ్ బహిరంగ లేఖ pic.twitter.com/8UwozGBIsq
— Ponnam Prabhakar (@PonnamLoksabha) November 21, 2022