Ponnam Prabhakar : బీసీల రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది
- తెలంగాణ బీసీలకు 42% రిజర్వేషన్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
- ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు నష్టం లేదంటూ స్పష్టం
- “రెడ్డి జాగృతి” పేరుతో వ్యక్తిగత చర్యలకు వ్యతిరేకంగా హెచ్చరిక
- బలహీన వర్గాల సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాల సామాజిక న్యాయాన్ని సాధించేందుకు తీసుకున్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల నిర్ణయం రాజ్యాంగబద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అయితే ఈ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. “బీసీల రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం కలిగించవు. ఇది బలహీన వర్గాలకు చేయూతగా ఉండే నిర్ణయం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారం ఈ చర్యను ముందుకు తీసుకెళ్తున్నాం” అని పేర్కొన్నారు.
Also Read
- Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
- Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్‌ల సమర్పణ.. 60 శాతం నమోదు..
- TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
కొంతమంది వ్యక్తిగత స్థాయిలో “రెడ్డి జాగృతి” పేరుతో చేసే చర్యలు మొత్తం వర్గానికి సంబంధించినవిగా పరిగణించకూడదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కల్మషం రాకుండా, పెద్దలు బలహీన వర్గాలకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. “రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీలకు ఉన్న హక్కుల మాదిరిగా బీసీలకూ హక్కులు ఉండాలన్నదే మా ప్రయత్నం. అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో బిల్లు ముందుకు వెళ్లింది.
రాజకీయ పార్టీల మద్దతే ప్రజల మద్దతు” అని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, పీసీసీ, ఏఐసీసీ ఇన్చార్జ్ సూచనల మేరకు తాను, డిప్యూటీ సీఎం వాకాటి శ్రీహరి ఢిల్లీ వెళ్లి సీనియర్ న్యాయవాదులను కలవనున్నట్లు తెలిపారు. బలహీన వర్గాల సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
Karnataka: బీహార్ ఎన్నికల తర్వాత కర్ణాటక సీఎం మారుతారా..? బీజేపీ నేత వాదనలో నిజమెంత..?
తాజావార్తలు
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
-
Jharkhand Protest: జార్ఖండ్ నిరసనల్లో ‘పుష్ప’.. విద్యార్థుల ఆందోళనలో వైరల్‌గా మారిన యువకుడు!
-
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!