Ponguleti Srinivasa Reddy: కేసీఆర్ చేతిలో కర్ర పట్టుకుని కపట నాటకాలు ఆడుతున్నారన్నారని వెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణం శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కులాలు, మతాల్లో ప్రాంతాల్లో చిచ్చు పెడుతున్న బీజేపీని మట్టి కరిపించాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చేతిలో కర్ర పట్టుకుని కపట నాటకాలు ఆడుతున్నారన్నారు.
Read also: Mallu Bhatti Vikramarka: సింగరేణి నీ కాపాడుతాం.. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళనివ్వం..
నామ నాగేశ్వరరావు గెలిస్తే జాతీయ మంత్రి అవుతాడని కేసీఆర్ అంటున్నాడు అంటే బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు ఒకే తాను ముక్కలన్నారు. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ముట్టుకునే దమ్ము ధైర్యం ఏ పార్టీ కి లేదన్నారు. బలమైన శక్తి గా రేవంత్ రెడ్డి నిలబడుతాడన్నారు. రాష్ట్రం లో ఎక్కడా రాని మెజారిటీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రావాలన్నారు. ముగ్గురు మంత్రులను చేసిన ముఖ్యమంత్రి కి ఈ జిల్లా గెలుపు ను బహుమతి ఇస్తామన్నారు. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి భాద్యత మాతోటే సాధ్యమన్నారు.
Read also: Kottankulangara Devi Temple : పురుషులు ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే చీర కట్టుకొని అలంకరించుకోవాలి..!
భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సింగరేణి నీ కాపడుతాం.. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళనివ్వమన్నారు. మూసి వేసినకాలం చెల్లిన ధర్మల్ పవర్ స్టేషన్ లను అందుబాటు లోకి తీసుకుని వస్తామన్నారు. ఫాం హౌస్ కి వెళ్లి వచ్చిన కేసీఆర్ పదేళ్లు మొద్దు నిద్ర పోయారన్నారు. సింగరేణి నీ కాపడుతాం.. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళనివ్వం రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా ఇస్తున్నామన్నారు. కొత్తగూడెం స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు. రిజర్వేషన్ తొలగించడానికి బీజేపీ చేసిన ప్రయత్నం గురించే సీఎం రేవంత్ చెప్పారన్నారు. రేవంత్ రెడ్డి పై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేసుల పేరుతో ఆఫ్ట్రాల్ మీరు ఢిల్లీకి పిలిపిస్తే మేము భయపడతామా? అన్నారు. తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు.
Osmania University : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరో 4 కొత్త కోర్సులు