Break for Marriages: బ్యాచ్ లర్స్ కు బ్యాడ్ న్యూస్.. పెళ్లి కావాలంటే 3 నెలలు ఆగాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Break for Marriages: పెళ్లి ఎప్పుడా అని ఎదురు చూసే బ్యాచ్ లర్స్ కు ఈ వార్త బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే లేట్ అయ్యింది త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకునే అమ్మాయిలకు, అబ్బాయిలకు వివాహం చేసుకోవాలంటే ఇక 3 నెలల వరకు నో ఛాన్స్ అని పురోహితులు చెబుతున్నారు. మళ్లీ ఆగస్టు 8 తర్వాతే పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుందని వెల్లడించారు. అయితే ఇప్పట్లో పెళ్లిళ్లు, శుభకార్యాలకు బ్రేక్ పడింది. బ్యాచ్ లర్స్ జీవితానికి బాయ్ బాయ్ చెప్పే రోజులు పోవాలంటే ఆగస్టు 8 తర్వతే అంటున్నారు పురోహితులు. ఎందుకంటే.. ఇప్పుడు నేటితో మూఢం ప్రవేసించింది. మాఢం అంటే గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని మూఢంగా జ్యోతిష్యులు చెబుతారు.
Read also: Road Accident : సిగ్నల్ దగ్గర ఆగివున్న 10వాహనాలను ఢీకొట్టిన పాల ట్యాంకర్
Also Read
అయితే.. గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినపుడు గురుమౌఢ్యంగా.. శుక్రగ్రహం సూర్యగ్రహనికి దగ్గర వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యంగా పిలుస్తారు. అయితే.. ఈ కాలాన్ని ఏవైనా పనులు ప్రారంభించడానికి అశుభంగా భావిస్తూ వాయిదా వేస్తుంటారు. కాగా.. ఈ సారి శుభకార్యాలు అశ్వయుజ మాసంలో మొదలయ్యాయి… ఒక్క పుష్యమాసంలో తప్ప మిగతా కార్తీకం, మాఘం, చైత్రమాసాలలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు భేషుగ్గా జరిగాయి . ఇక కొన్ని సందర్భాల్లో అయితే.. అత్యవసరం అనుకునేవారు వారికి కావాల్సిన అనుకూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ముహూర్తాలకు వెసులుబాటు తీసుకున్నారు. అయితే..ఈ నాలుగు నెలల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 20 వేల పెళ్లిళ్లు జరిగాయని పురోహితులు తెలిపారు.
Read also: Ashu Reddy : రెడ్ డ్రెస్సులో హాట్ చిల్లీలా అషు రెడ్డి స్టిల్స్ ..
కాగా.. ఆ రోజుల్లో బ్రాహ్మణులు, ఇతర కులవృత్తులవారు, బంగారం వ్యాపారులు, ఫంక్షన్‌హాళ్ల యజమానులు, ట్యాక్సీలు, వస్త్రవ్యాపారులు… ఇలా పలువర్గాల వారికి చేతినిండా పనే అని చెప్పాలి. ఎందుకంటే పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. బంగారం ధర పెరుగుతున్నా కొనుగోలుదారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. పెళ్లి అంటే ఇక బంగారం కొనాల్సిందే. ఇక ఇవాళ్టి నుంచి (శనివారం 27) నుంచి ప్రారంభమయ్యే మూఢం ఆగస్టు 8 వరకు కొనసాగనుంది. ఇక ఈ మూడు నెల్లలో వివాహాలు, పెళ్లిచూపులు, గృహప్రవేశాలు తదితర శుభకార్యాల జోలికి వెళ్లరు. వివాహం కావాలంటే మళ్లీ ఆగస్టు 8వ తేదీ వరకు ఆగాల్సిందే మరి.. అప్పటి దాకా వీటిపై ఆధారపడిన బ్యాండు, వాయిద్య కళాకారులు, అలంకార నిపుణులు, టెంట్ హౌస్ నిర్వాహకులు, పూల అమ్మకందారులు, క్యాటరింగ్ నిర్వాహకులు తదితరులు కాస్త విశ్రాంతి తీసుకోవాల్సిందే అని తెలుస్తుంది.
AP Elections 2024: ఈసీ కీలక నిర్ణయం.. ఎన్నికల విధుల్లోకి అంగన్‌వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులు
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!