Actress Anu Gowda Badly Injured In Land Dispute: కన్నడ నటి అనుగౌడకు తాజాగా ఓ చేదు అనుభవం ఎదురైంది. సొంతూరిలో కొందరు వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. రక్తం వచ్చేలా కొట్టారు. ఒక భూమి విషయంలో నెలకొన్న వివాదమే ఇందుకు కారణమని తెలిసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం షిమోగా జిల్లాలోని హోస్ నగర్‌కి చెందిన అనుగౌడకి సాగర్ తాలూకాలోని కస్పాడిలో ఒక భూమి ఉంది. అనుగౌడ తల్లిదండ్రులు అందులో వ్యవసాయం చేసేవారు. దీంతో.. ఆమె అప్పుడప్పుడు ఆ ప్రాంతానికి వచ్చి వెళ్తుండేది. మరోవైపు.. అదే భూమిపై కొంతకాలం నుంచి వివాదం నడుస్తోంది. ఈ ల్యాండ్ తమదేనంటూ కొందరు వ్యక్తులు అనుతో గొడవ పడుతున్నారు. అయితే.. అను మాత్రం వెనక్కు తగ్గలేదు. తన తల్లిదండ్రులు వ్యవసాయం చేసిన ఈ భూమి తనదేనని వారితో పంతానికి దిగింది. ఇలా ఆ భూమి విషయమై ఇరువర్గాల మధ్య వివాదం సాగుతోంది.
Niharika-Chaitanya Divorce: నిహారిక-చైతన్య విడాకులు.. ముందుగా పిటిషన్ వేసింది ఎవరో తెలుసా?
కట్ చేస్తే.. రీసెంట్‌గా అనుగౌడ ఈ భూ వివాదం విషయంలోనే కస్పాడికి వెళ్లింది. దీంతో మరోసారి అనుగౌడతో వాళ్లు గొడవకి దిగారు. అంతటితో ఆగకుండా.. ఆమెపై దాడి కూడా చేశారు. నీలమ్మ, మోహన్ కలిసి.. ఆమెపై ఎటాక్ చేసినట్లు తెలిసింది. ఈ దాడిలో అనుగౌడ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో.. హుటాహుటిన అనుగౌడను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. ఈ నటిపై దాడి చేసిన ఆ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. అనుగౌడ గతంలో చాలా సినిమాల్లో నటించి, నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు గడించారు. కిచ్చా సుదీప్, విష్ణువర్ధన్, శివరాజ్ కుమార్ వంటి స్టార్ హీరోల సినిమాల్లోనూ కీలక పాత్రల్లో నటించారు. అలాంటి సీనియర్ నటికి, ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వడం నిజంగా దురదృష్టకరం.
Kiccha Sudeep: కిచ్చా సుదీప్ మోసం చేశాడు.. నిర్మాత సంచలన ఆరోపణలు