Telangana Police: బాసూ మీరు మ..మ..మాస్.. ఫుల్ జోష్ లో డ్యాన్స్ ఇరగ దీసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Police: హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీలో లక్షకు పైగా విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. హైదరాబాద్ నలుమూలల నుంచి వస్తున్న బొజ్జ గణపయ్యలతో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు సందడిగా మారింది. నిమజ్జనాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ‘గణపతి బప్పా మోరియా’, ‘జై బోలో గణేష్ మహారాజ్’ నినాదాలతో ట్యాంక్‌బండ్ పరిసరాలు మారుమోగుతున్నాయి. ట్యాంక్‌బండ్‌పై ఎక్కడ చూసినా జనంతో నిండిపోయింది. ఖైరతాబాద్ గణేష్ ఎదుట భక్తులతో పాటు పోలీసులు కూడా తీన్మార్ స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. భక్తులతో కలిసి తీన్ మార్ స్టెప్పులు వేస్తూ అందరిని ఆకర్షించారు. పోలీసులు అందరూ ప్రజలతో మమేకమై డ్యాన్సుల చేస్తుంటే అక్కడి వచ్చిన వారందరూ ఆశక్తిగా పోలీసులు చేస్తున్న డ్యాన్స్ ను ఆనందంగా తలికించారు. పోలీసులు ఫుల్ జోస్ లో తీన్ మార్ డబ్బులకు స్టెప్పులు వేస్తూ ఆనందంగా గడిపారు. పోలీసులను చూసిన అక్కడి జనం బాసూ మీరు మ..మ.. మాస్ పోలీస్.. ఫ్రెండ్లీ పోలీస్ అంటూ విజిల్స్ వేస్తూ పోలీసులకు ఉత్సాహాన్ని నింపిన తీరు ఆహ్లాద వాతావరణం నింపింది.
Read also: Kokapet-Budvel: కేక పుట్టించిన కోకాపేట, బుద్వేల్ భూముల వేలం.. రూ. 6.5 కోట్ల ఆదాయం
Also Read
బాలాపూర్ గణేశ శోభాయాత్ర కూడా కొనసాగుతుంది. పాతబస్తీ, చార్మినార్, ఎంజీ మార్కెట్ మీదుగా బాలాపూర్ హుస్సేన్ సాగర్ చేరుకుంటుంది. అనంతరం బాలాపూర్ అమరవీరుని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తారు. అంతకు ముందు ఖైరతాబాద్ మహా గణేశుడి ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. ఉదయం 6.30 గంటలకు గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. గణపతి శోభాయాత్ర టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా సాగింది. అనంతరం ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్‌కు చేరుకుంది. ఖైరతాబాద్ బడా గణేష్ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన క్రేన్ నంబర్ 4 దగ్గర పూజల అనంతరం నమజ్జనం చేశారు. అంతకుముందు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ముగింపు కార్యక్రమం జరిగింది. అయితే ఈసారి ముందుగానే చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది.
Telangana BJP: తెలంగాణంలో ఎన్నికల ప్రచారానికి బీజేపీ రె’ఢీ’.. వచ్చే నెలలో షెడ్యూల్ ఇదే..
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!