హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు ఉత్సాహభరితంగా, ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. డీజేలు, బ్యాండ్లు, కోలాటాలు, డప్పుల మోతలు, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ భక్తులు భారీగా ట్యాంక్‌బండ్ వైపు తరలివస్తున్నారు.
Telangana Police: హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీలో లక్షకు పైగా విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. హైదరాబాద్ నలుమూలల నుంచి వస్తున్న బొజ్జ గణపయ్యలతో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు సందడిగా మారింది. నిమజ్జనాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు.