నగరంలో ఈ మధ్య కాలంలో బైక్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొంతమంది ముఠాలుగా ఏర్పడి బైక్ చోరీలకు పాల్పడుతున్నారు అని సీపీ మనీష్ కుమార్ సిన్హా అన్నారు. ఆరు స్టేషన్ ల పరిధిలో జరిగిన బైక్ దొంగతనల్లో 27 మందిని అరెస్ట్ చేసాం. బైక్స్ దొంగతనం చేసిన ముగ్గురు నిందితుల్లో విజయనగరం జిల్లా గంట్యాడ ప్రాంతనికి చెందిన మాలోతు ఎర్రన్నాయుడు తో పాటు మరో ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేసాం. వీరితో పాటు దొంగిలించిన బైక్స్ కొనుగోలు చేసిన 24 మంది అరెస్ట్ చేశాం. విశాఖ పోలీస్ కమిషనరేట్, పెందుర్తి, గాజువాక, మల్కాపురం, విజయనగరం జిల్లాలో పలు స్టేషన్ పరిధిలో కేసులు నమోదయ్యాయి. 13 లక్షల 20 వేల విలువైన 33 బైక్స్ స్వాధీనం చేసుకున్నారు.