సాధారణ బిల్లుతో రోగులపైన అధిక ఫీజుల, భారం మోపకుండా సేవ చేయాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మాదాపూర్ లో మెడికవర్ హాస్పిటల్ 25వ శాఖను ఆయన ప్రారంభిస్తూ మాట్లాడారు.. ఆపత్కాల సమయంలో క్టర్స్, స్టాఫ్ నర్స్ లో సేవలు వెలకట్టలేనివని, కరోనా విపత్కర పరిస్థితిలో సాహసోపేతమైన విధులు నిర్వహించారని స్పీకర్ వారిని కొనియాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఆరోగ్య రాష్ట్ర తెలంగాణగా మార్చనున్నారని, ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పటివరకు 20,000 బెడ్స్ సామర్థ్యం నుంచి 50 వేల బెడ్స్ సామర్థ్యానికి పెంచబోతున్నారని, రాష్ట్రంలోని నిమ్స్ హాస్పిటల్ 4000 పడకల ఆసుపత్రిగా త్వరలోనే రూపుదిద్దుకోనున్నదని ఆయన అన్నారు.
Also Read : Success Story : పూల సాగు తో ప్రతినెల 70వేల ఆదాయాన్ని పొందుతున్న రైతు..
తెలంగాణలోని మెడికల్ విద్యను అభ్యసించడం కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్లే వాళ్లని రాష్ట్రంలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ లను మంజూరు చేయడం వలన విద్యార్థుల వలసలు తగ్గాయని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు అడగకుండానే అనేక పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని, ప్రజలకు సుపరిపాలన అందించే ప్రభుత్వాలను ప్రజలు ఆదరించాలని స్పీకర్ పోచారం కోరారు. ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ నగర కమిషనర్ సీవీ ఆనంద్, ఆర్టీసీ చైర్మన్ సజ్జనర్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : Nithin : వకీల్ సాబ్ దర్శకుడితో సినిమా చేయబోతున్న నితిన్…?