Pinarayi Vijayan: కేంద్రానికి కేరళ సీఎం లేఖ.. వ్యాపారి సీజే.రాయ్ ఆత్మహత్యపై విచారణ జరపాలని డిమాండ్
- కేంద్రానికి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ
- వ్యాపారి సీజే.రాయ్ ఆత్మహత్యపై విచారణ జరపాలని డిమాండ్
- జనవరి 30న బెంగళూరులో సీజే.రాయ్ ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనవరి 30న బెంగళూరులో ఆదాయపు పన్ను శాఖ సోదాల సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్, రియాల్టీ షోల నిర్వాహకుడు సీజే. రాయ్ మరణంపై న్యాయ విచారణ జరపాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లేఖ రాశారు.
ఈ సంఘటన ‘దేశ పన్ను పరిపాలనపై మచ్చ’’గా అభివర్ణించారు. సోదాల సమయంలో జరిగిన విధానపరమైన లోపాల గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ఉన్నప్పుడు రాయ్ ఎలా లోడ్ చేసిన తుపాకీని పొందగలిగారని ప్రశ్నించారు. ‘‘ప్రోటోకాల్ యొక్క తీవ్రమైన వైఫల్యం.’’గా పేర్కొన్నారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ఐటీ అధికారులు వేధించారని రాయ్ సోదరుడు చేసిన ప్రకటనలను గుర్తుచేశారు. ఐటీ అధికారులు కుటుంబాన్ని వేధించారని చేసిన ఆరోపణలను కూడా సీఎం హైలైట్ చేశారు. మాజీ న్యాయమూర్తి నేతృత్వంలోని నిష్పాక్షిక న్యాయ విచారణ మాత్రమే పూర్తి సత్యాన్ని బయటకు తీసుకురాగలదని చెప్పారు. కర్ణాటక పోలీసుల దర్యాప్తును అంగీకరిస్తున్నామని.. పరిపాలనా విధానాలు, తగిన శ్రద్ధ, అధికారుల ప్రవర్తనను పరిశీలించడానికి విస్తృత దర్యాప్తు అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. ఆలస్యం లేకుండా విచారణకు ఆదేశించాలని.. కాలపరిమితి నివేదికను సమర్పించాలని కేంద్రాన్ని కోరారు.
అసలేం జరిగిందంటే..
శుక్రవారం బెంగళూరులోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు జరిగాయి. అదే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో లైసెన్స్‌డ్ తుపాకీతో ఛాతీలో కాల్చుకుని సీజే.రాయ్ ప్రాణాలు తీసుకున్నారు. సిబ్బంది ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సీజే రాయ్‌కు భార్య లిని రాయ్, కుమారుడు రోహిత్, కుమార్తె రియా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా విదేశాల్లో ఉన్నారని పోలీసులు తెలిపారు. అశోక్‌నగర పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Kerala Chief Minister Pinarayi Vijayan has written to Union Finance Minister Nirmala Sitharaman seeking a judicial inquiry into the death of C.J. Roy, Chairman of the Confident Group, who died by suicide during an Income Tax search in Bengaluru on January 30.
In the letter, the…
— ANI (@ANI) February 2, 2026
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!