Success Story : పూల సాగు తో ప్రతినెల 70వేల ఆదాయాన్ని పొందుతున్న రైతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచి కంపెనీలో ఉద్యోగం..మంచి జీతం అయిన కూడా ఏదో తెలియని కొరత.. ఇంకా ఏదైనా సాధించాలని ఉద్యోగాన్ని వదిలేసాడు.. కష్టాన్ని నమ్ముకొని ఇప్పుడు అందరికి ఆదర్శంగా మారాడు..ఈ క్రమంలోనే అతను పొలం బాట పట్టాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగంలో లభించని సంతోషాన్ని వ్యవసాయంలో వెతుక్కుంటూ పల్లెటూరి బాటపట్టాడు.. మార్కెట్ ను శాసిస్తున్న డిమాండ్ ఉన్న వ్యవసాయం ఏంటో, దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాడు..స్థానిక వాతావరణ పరిస్థితులను నిశితంగా పరిశీలించాడు. ఏడాది పొడవునా ఆదాయం వచ్చే పంటలను సాగు చేయటం ద్వారా మంచి అదాయం పొందవచ్చని గుర్తించాడు. అనుకున్నదే తడువుగా గులాబీల సాగుకు శ్రీకారం చుట్టాడు. ఏలూరు వాసి పృథ్వీ..
ఇతను కష్టపడి బీటెక్ విద్య పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాడు. అయితే అది ఏమాత్రం నచ్చకపోవటంతో తన తండ్రులు అనుసరించిన వ్యవసాయన్ని కొనసాగించాలని నిర్ణయించుకుని సొంత ఊరు వచ్చేశాడు. వాణిజ్య పంటలలో గులాబీ సాగు మంచి లాభాలను అందిస్తుందని తెలుసుకున్నాడు.. గులాబీ సాగులో మెళుకువులను తెలుసుకున్నాడు. 15 ఎకరాల్లో గులాబీ పూల సాగు ప్రారంభించాడు. బెంగుళూరు రకం, సెంటు రకాల సాగు చేపట్టాడు.. అదే అతని పనిగా మార్చుకున్నాడు సక్సెస్ గా రానిస్తున్నాడు..
Also Read
- తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
- Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
మొక్క నాటిన 5 నెలల నుంచి పూల దిగుబడి ప్రారంభమైంది. మూడు సీజన్‌లకు కలిపి ప్రతి నెల సుమారుగా 400 కేజీల పూల వరకు విక్రయిస్తున్నాడు. నెలకు నికరంగా 60 నుంచి 70 వేల వరకు లాభం పొందుతున్నాడు. ఒకసారి మొక్కలు నాటితే 6 నుంచి 8 ఏళ్ల వరకు పూల ఉత్పత్తి వస్తుంది. ప్రతి నెల నికర ఆదాయం లభిస్తుండటంతో తోటి రైతులు సైతం గులాబీ సాగువైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో మేలు రకాల పూలను సాగు చేస్తూ మంచి అదాయం పొందుతున్నాడు.. అదే తనకు తృప్తిని ఇస్తుందని చెప్పుకొచ్చాడు.. దేశ వ్యాప్తంగా తన పూలను అమ్మాలని కోరుకుంటున్నాడు..
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!