PM Modi tour: ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈనేపథ్యంలో.. బేగంపేట విమానాశ్రయం వద్ద చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్, తెలంగాణ సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, ఎంపీలు బండి సంజయ్, లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి ప్రధాని మోడీని కలిసి ఘనంగా స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రధాని మోడీ నేరుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. బేగంపేట విమానాశ్రయం నుంచి పరేడ్ గ్రౌండ్ మీదుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ప్రధాని మోదీ చేరుకుంటారు. దీంతో ఆ మార్గంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రారంభించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు.
Read also: Agent: అక్కినేని కుర్రాడు స్పీడ్ పెంచాడు…
ప్రధాని మోడీ పెరేడ్ గ్రౌండ్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లనున్న రూట్ మ్యాప్ వద్ద పోలీసుల భారీ భద్రత ఏర్పాటు చేశారు. వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు కట్టుదిట్టం చేశారు. రాష్ట్ర పోలీస్ సిబ్బందితో పాటు కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. బేగంపేట నుండి పెరేడ్ గ్రౌండ్ మీదుగా సికింద్రాబాద్ రూట్ వైపు ట్రాఫిక్ నిలిపి వేశారు. బేగంపేట్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాని పర్యటన అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు. సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
TSPSC Paper: ప్రియురాలి కోసం రూ.6లక్షలతో టీఎస్‌పీఎస్‌సీ పేపర్ కొన్న వ్యక్తి