Telangana BJP Meeting: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై దృష్టి సారించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం, నేడు (అక్టోబర్ 5) రాష్ట్ర పదాధికారుల అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికల కోసం పార్టీని సిద్ధం చేయడం, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై కీలక చర్చ జరిగింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహం మరియు అభ్యర్థి ఎంపికపై కూడా చర్చించే అవకాశం…
KTR : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు చెప్పిన అబద్దాలకు అక్కడి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక్కడ ఆరు గ్యారంటీలు అమలు చేయకుండానే అన్ని హామీలు అమలు చేసినట్లు చేసిన దొంగ ప్రచారానికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. తెలంగాణ ప్రజల రూ. 300 కోట్ల సొమ్ముతో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చి మహారాష్ట్రలో తిమ్మిని బమ్మిని చేద్దామనుకున్న రేవంత్…
మోడీ కామెంట్లతో తెలుగు రాష్ట్రాలు హీటెక్కాయి. రాష్ట్ర విభజన జరిగి ఏడున్నరేళ్ళు పూర్తవుతున్నా మోడీ విభజనపై మంటలు రాజేశారు. పనిలో పనిగా కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు మోడీ. దీనిపై కాంగ్రెస్ నేతలు తెలుగు రాష్ట్రాల్లో నిరసనలకు దిగారు. గాంధీ భవన్ ముందు ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దగ్దం చేశారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర విభజన, కాంగ్రెస్ పై మోడీ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు దిగారు. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు…