Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సుప్రీంకోర్టులో రేపటికి వాయిదా పడింది. ఈ సందర్భంగా, కేసు దర్యాప్తునకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి ఒక ముఖ్య విషయాన్ని తెలియజేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు దర్యాప్తు సంస్థతో ఏమాత్రం సహకరించడం లేదని, దర్యాప్తు సంస్థతో ఆయన ఆటలాడుతున్నారని ఆరోపించారు.
అంతేకాకుండా, కీలకమైన రుజువులను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగంగా ప్రభాకర్ రావు తన ఐక్లౌడ్‌లోని డేటాను డిలీట్ చేశారని కూడా న్యాయస్థానానికి వెల్లడించారు. అయితే, ప్రభాకర్ రావు తరఫు సీనియర్ న్యాయవాది ఆ రోజు అందుబాటులో లేకపోవడంతో, ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ కీలక కేసులో విచారణ రేపు కూడా కొనసాగనుంది.
IP68/69 రేటింగ్ సర్టిఫికేషన్స్, 50MP+50MP కెమెరా సెటప్ తో రాబోతున్న Oppo Reno 15c..