ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 16వ రోజు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది.
ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్ర.. ఇవాల దస్నాగూడ రైతులతో చర్చించుకుంటూ ముందుకు సాగుతున్నారు. సాగునీరు అందక జొన్న చేను ఎండిపోతుందని జొన్న కంకులు తీసుకువచ్చి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చూపించి గంగాధర్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తన పాదయాత్రలు కల్లు రుచి చూశారు.. మధిర నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గత ఆరు రోజుల నుంచి మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రను కొనసాగుతున్న విషయం తెలిసిందే కాగా.. ఈ రోజు పాదయాత్ర వల్లభి గ్రామ సమీపానికి చేరుకుంది.. ఈ సమయంలో కల్లు గీత కార్మికులు కల్లు తాగాల్సిందిగా భట్టిపై ఒత్తిడి చేయడంతో.. ఓ పట్టుపట్టి ఖుషి అయ్యారు.. ఇక, ప్రజలకు మెడిసిన్ మాదిరిగా ఉపయోగపడే కల్లును దూరం చేయడానికి…
తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రజా సమస్యల పరిష్కారానికి పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర)ను ఇవాళ ప్రారంభించారు.. ముదిగొండ మండలం యడవల్లిలో యాత్ర ప్రారంభమైంది.. మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఖమ్మం జిల్లా నాయకులు ఈ సందర్భంగా భట్టి విక్రమార్కకి ఘనంగా స్వాగతం పలికారు. పాదయాత్ర ప్రారంభించిన యడవెల్లి జన ఉప్పెనగా మారింది. గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీర…