Telangana: పెద్దపల్లి జిల్లాలో దారుణం.. తండ్రిని చంపిన కొడుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి కన్న తండ్రినే కడతేర్చాడు. వివరాలలోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా లోని సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధి లోని పూసాలలో తీగల నరసయ్య తీగల రాజేశం అనే తండ్రి కొడుకుకులు నివాసం ఉంటున్నారు. అయితే వాళ్ళు పండించిన పంటను విక్రయించేందుకు పూసాలలోని ఐకెపి సెంటర్ కి తీసుకు వెళ్లారు. అనంతరం పూసాలలోని ఐకెపి సెంటర్లో ధాన్యం విక్రయిస్తుండగా తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తీగల నరసయ్య కొడుకు తీగల రాజేశం ఆవేశానికి లోనైయ్యాడు. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన తీగల రాజేశం ఎదురుగా ఉంది తన కన్న తండ్రి అనే విఆశయాన్ని కూడా మర్చిపోయి పక్కనే ఉన్న బండరాయితో తన తండ్రి తీగల నరసయ్య తల పైన బలంగా కొట్టాడు. దీనితో తీవ్ర రక్తస్రావానికి గురైన తీగల నరసయ్య మృతుచెందారు.
Read also:CMD Prabhakar Rao: నాకు సమాచారం లేదు.. సీఎం పిలిస్తే ఎందుకు వెళ్లను?
Also Read
ఈ ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కాగా తీగల నరసయ్య మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం తరలించారు. కాగా ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా నిందితుడు రాజేశం ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఉన్నారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?