తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్… ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.. త్వరలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా సమక్షంలో అధికారికంగా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక, ఆయన ఎమ్మెల్యే రాజీనామాకు వెంటనే స్పీకర్ ఆమోదం తెలపడంతో.. ఉప ఎన్నికల అనివార్యం అయ్యింది.. అయితే, తన సిట్టింగ్ స్థానాన్ని మరోసారి గెలుచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా.. విజయం మాదంటే మాదేనంటూ బీజేపీ, టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పాదయాత్ర చేపట్టింది.. కరోనా కారణంగా పాదయాత్రకు దూరమైన పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. త్వరలోనే మునుగోడులో అడుగుపెట్టనున్నారు.. ఈ నెల 20 న మునుగోడుకి వస్తున్నానని ప్రకటించారు రేవంత్రెడ్డి.. కార్యకర్తలు ఎవరూ అధైర్య పడొద్దని సూచించారు.
Read Also: SBI hikes MCLR: మళ్లీ వడ్డీరేట్లు పెంచిన ఎస్బీఐ.. మూడు నెలల్లో మూడోసారి..
ఇక, సీఎం కేసీఆర్.. నాయకుల కొనుగోలకు తెరలేపారని మండిపడ్డారు రేవంత్రెడ్డి.. పార్టీ ఫిరాయింపులకు టీఆర్ఎస్ను అడ్డాగా మార్చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. సర్పంచ్, ఎంపీటీసీలను కొనుగోలు చేసి గెలవాలని ప్రయత్నం చేస్తున్నారని.. రాష్ట్రాన్ని ఫిరాయింపుల ప్రయోగ శాలగా మార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మునుగోడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ధర్మభిక్షం, మల్లు స్వరాజ్యంల వారసత్వం.. నాకు కరోనాతో అక్కడికి రావడం కొంత ఆలస్యం అయ్యిందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు విజ్ఞప్తి.. ఎనిమిదేళ్లుగా ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం.. మన ప్రభుత్వం వచ్చే ముందు తప్పటడుగులు వేయకండి.. వచ్చేది మన ప్రభుత్వమే అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.
కేసీఆర్ మళ్లీ అదే నీచత్వం… మునుగోడు సహించదు!#ManaMunugodeManaCongress pic.twitter.com/7PoSZ3jCcY
— Revanth Reddy (@revanth_anumula) August 15, 2022