Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Pcc Chief Mahesh Goud Slams Kcr Brs Telangana Movement

TPCC Mahesh Goud : కేసీఆర్ దీక్ష నాటకం.. మహేష్ గౌడ్ ఫైర్

Published Date :November 28, 2025 , 4:41 pm
By Gogikar Sai Krishna
  • ఉనికి కోసం బీఆర్‌ఎస్‌ దీక్షా దివస్‌ చేయాలని చూస్తుంది
  • కేసీఆర్‌ చేసిన దీక్ష ఎలా చేశాడు.. అప్పుడు ఏం జరిగిందో అందరికి తెలుసు
  • కేసీఆర్‌ దీక్ష ఓ నాటకం
  • తెలంగాణ సోనియా గాంధీ వల్లే వచ్చింది. -మహేష్‌గౌడ్‌
TPCC Mahesh Goud : కేసీఆర్ దీక్ష నాటకం.. మహేష్ గౌడ్ ఫైర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

TPCC Mahesh Goud : కేసీఆర్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పార్టీలో జరిగిన పరిణామాలు, బీఆర్‌ఎస్ ప్రకటించిన “దీక్షా దివస్”పై స్పందిస్తూ, బీఆర్‌ఎస్ ఇప్పుడు ఉనికి కోల్పోయిన పార్టీగా మారిందని, మళ్ళీ కనిపించేందుకు కొత్త నాటకాలే ఆశ్రయిస్తోందని అన్నారు. కేసీఆర్ గతంలో చేసిన తెలంగాణ రాష్ట్ర దీక్షను పూర్తిగా నాటకమని అభివర్ణిస్తూ, ఎనిమిది రోజుల దీక్షలో ఆయన ఆసుపత్రిలోనే సెలైన్ ఎక్కించుకున్నారని, విటమిన్ ఇంజెక్షన్లు తీసుకున్నారని మహేష్ గౌడ్ ఆరోపించారు. “ఇది ఏ దీక్ష? ప్రజలు మోసపోయారు… కానీ నిజాలు బయటకు వచ్చాయి” అని ఆయన అన్నారు.

అదే సమయంలో, “తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబంలో ఒక్కరు కూడా ప్రాణత్యాగం చేయలేదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు.. వాళ్లే తమ ప్రాణాలు అర్పించి తెలంగాణను తెచ్చారు” అని తెలిపారు. “వచ్చిన తెలంగాణను మాత్రం కేసీఆర్, అతని కొడుకు, అతని మేనల్లుడు కలిసి దోచుకున్నారు. రాష్ట్రాన్ని కుటుంబ ఆస్తిలా భావించి పాలించారు” అని ఆరోపించారు. తెలంగాణ సృష్టిలో సోనియా గాంధీ పాత్రను గుర్తుచేసిన మహేష్ గౌడ్, “కేసీఆర్‌కి చిత్తశుద్ధి ఉంటే సోనియా గాంధీ ఫోటోకు పాలాభిషేకం చేయాలి. నిజమైన తెలంగాణ తల్లి ఆమె” అని అన్నారు.

అమరవీరులకే తెలంగాణ రుణపడి ఉందని, కేసీఆర్ పేరుకు మాత్రమే ఉద్యమం నడిపాడని వ్యాఖ్యానించారు. హరీష్ రావు వ్యాఖ్యలను కూడా ప్రస్తావిస్తూ, “హరీష్ రావుకు పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టడానికి ధైర్యం దొరకలేదు. దళితులు, బీసీలకు అయితే అగ్గిపెట్టె కూడా దొరికింది” అని అన్నారు. బీఆర్‌ఎస్ ఇప్పుడు ప్రజా ఆమోదం కోల్పోయి, కొత్త రాజకీయ స్థానం కోసం ప్రయత్నిస్తోంది అని పేర్కొన్నారు. “కేసీఆర్‌కు కూడా బీఆర్‌ఎస్ శకం ముగిసిన విషయం తెలుసు. అందుకే అసంబద్ధ దీక్షలు, కార్యక్రమాలతో ప్రజల్లో కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు” అని విమర్శించారు.

SSC Recruitment 2025: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్ లో 7,948 ఎంటీఎస్, హవల్దార్‌ జాబ్స్..

రాష్ట్రంలోని కార్పోరేషన్ చైర్మన్‌ల పదవులకు కొనసాగింపు లేదని, వారు ఇకపై DCCలుగానే పనిచేస్తారని తెలిపారు. ఈ క్రమంలో నల్గొండ DCC అధ్యక్షుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తాను కలిసిన విషయం స్పష్టం చేశారు. గతంలో పున్నా కైలాస్ చేసిన వ్యాఖ్యలు తప్పు అని, ఆయన కోమటిరెడ్డికి వివరణ ఇచ్చారని చెప్పారు. బీజేపీ-ఓవైసీ సంబంధాలపై వ్యాఖ్యానిస్తూ.. “బీజేపీ నేతలు ఓవైసీని తలుచుకోకుండా టిఫిన్ కూడా తినలేరు. రోజంతా ఓవైసీ జపమే. వాళ్ల సమస్య వాళ్లదే… దానికి మనం ఏమి చేయలేము” అన్నారు.

బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలని కోరుతూ, త్వరలో ప్రధానిని కలవనున్నట్లు వెల్లడించారు. బీసీ బిల్లుకు అడ్డుకట్ట వేస్తున్నది బీజేపీ అని ఆరోపించారు. “బీసీ నేతలు కాంగ్రెస్‌ని నిలదీయడం కాదు… అడ్డుకుంటున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌లను నిలదీయాలి. సాయం చేసినవారి ఇంటి ముందు నిరసన ఎంతవరకు సమంజసం?” అని ప్రశ్నించారు.

“మేము బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాం. మాపై ఆందోళనలు చేస్తే నష్టమైతే ప్రజలకే” అని స్పష్టం చేశారు. తాను నక్సలైట్ బాధితుడినని గుర్తుచేసుకున్న మహేష్ గౌడ్, కాంగ్రెస్ ఎలాంటి హింసను కూడా సమర్థించదని తెలిపారు. “పోలీసుల కాల్పుల్లో కూడా కొందరు చనిపోయారు. మావోయిస్టుల చేతుల్లో కూడా ప్రాణాలు పోయాయి. కానీ ఏ హింసనూ సమర్థించను” అని అన్నారు. జనజీవన స్రవంతిలోకి రావాలనుకునే వారికి అవకాశం ఇవ్వాలని, కానీ లొంగిపోవడానికి అవకాశం ఇవ్వకుండా కాల్చివేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.

Asia Power Index 2025: ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్‌కు 3వ స్థానం.. చైనా, పాక్ ర్యాంకులు ఎంతంటే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • congress
  • kcr
  • Telangana Politics

తాజావార్తలు

  • Virat Kohli Fans: మీ అభిమానం తగలేయ్య!!.. పేరెంట్స్ కోహ్లీకి బిగ్ ఫ్యాన్స్.. కుమారుడికి ఏం పేరు పెట్టారో చూడండి..

  • Papam Prathap Trailer: ‘పాపం ప్రతాప్’ ట్రైలర్ అదిరింది.. తిరువీర్ ఖాతాలో మరో హిట్ పక్కా!

  • Anchor Vishnupriya : అర్ధనగ్న ఫొటోలు పోస్ట్ చేస్తుందని యాంకర్ విష్ణుప్రియపై కేసు నమోదు

  • RR vs RCB Controversy: ఈ సీజన్‌లోనే అతిపెద్ద వివాదం!! అడ్డంగా దొరికిన రాజస్థాన్ మేనేజర్.. పక్కనే వైభవ్..

  • Banana Health Benefits: కెమికల్స్ తో పండించిన అరటిపండ్లను తింటున్నారా? FSSAI మార్గదర్శకాలతో నిమిషాల్లో గుర్తించొచ్చు!

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions