సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ లపై రేవంత్ రెడ్డి ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. స్థానిక నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని..కాంగ్రెస్ లో నుండి పోయ్యేది లేదు… ఇక టీఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చే వాళ్ళే ఉంటారని పేర్కొన్నారు. టీఆర్ ఎస్ చెరువు తెగింది..ఇక కాంగ్రెస్ పార్టీ కి అండగా ఉండాలని కోరారు.
గతంలో…. జేబు నిండా పైసలు తీసుకెళ్తే… సంచి నిండా కూరగాయలు వచ్చేవని..కానీ ఇప్పుడు సంచి నిండా డబ్బులు తీసుకుపోతే జేబు నిండా కూడా కూరగాయలు రావట్లేదని తెలిపారు. కెసిఆర్..మోడీ జనాన్ని మోసం చేశారని… పేదల ఖాతా లో 15 లక్షలు ఎస్తా అని మోడీ అన్నాడు.. 15 పైసలైనా వేశారా..? అని నిలదీశారు. ఢిల్లీలో అగ్గి పుట్టిస్తా అన్న కెసిఆర్..ఫార్మ్ హౌస్ లో పెగ్గులు వేసి పడుకున్నాడని మండి పడ్డారు. త్వరలోనే పాదయాత్ర నిర్వహిస్తామని… వైఎస్ ను ఎలాగైతే ఆశీర్వాదం ఇచ్చారో… ఇప్పుడు కూడా ఆశీర్వాదం ఇవ్వామని కోరారు. పేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నారు.