Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే మూల్యం చెల్లించక తప్పదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tuesday Horoscope August 4 2026: మేష రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో మంచి ప్రగతి లభిస్తుంది. నూతన పరిచయాలతో అభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన పనులలో ఎదురయ్యే ఆటంకాలను విజయవంతంగా అధిగమిస్తారు. ధార్మిక విషయాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరు శ్రీ మల్లికార్జున స్వామిని ఆరాధిస్తూ శివాష్టకాన్ని పారాయణం చేయడం శుభప్రదం. వృషభ రాశి వారు నిరుత్సాహాన్ని వీడి కీలకమైన పనులను పట్టుదలతో పూర్తి చేయాలి. ఆర్థిక వ్యవహారాలలో అత్యంత అప్రమత్తంగా ఉండటం మంచిది. కుటుంబంలో జరిగే శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. వీరు శ్రీ దుర్గా అమ్మవారిని స్మరిస్తూ దుర్గా కవచాన్ని పారాయణం చేయాలి.
మిథున రాశి వారు అనుకున్న పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలి. గృహ నిర్మాణ పనులలో అంచనాలు కొంత తారుమారయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సమయానికి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. వీరు శ్రీ దత్తాత్రేయ స్వామిని ధ్యానిస్తూ నిరంతరం దత్త నామ జపం చేయడం శ్రేయస్కరం. కర్కాటక రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. మానసిక ప్రశాంతతను పొందుతారు, దైవ కార్యాల్లో పాల్గొంటారు. వీరు శ్రీ నరసింహ స్వామి వారి కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఉత్తమం.
Also Read
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
కుంభ రాశి వారు ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించాలి. ఇతరుల అనవసర వ్యవహారాలలో తలదూర్చకూడదు. సొంత పనులపై, వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలి. వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉన్నందున ఆచితూచి అడుగు వేయాలి. వీరు శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రపత్తి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. మీన రాశి వారు భాగస్వామ్య వ్యాపారాలను తిరిగి నిలబెట్టుకుంటారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు మేలు చేస్తాయి. కీలకమైన పనులు ప్రారంభమవుతాయి. వీరు శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని ధ్యానిస్తూ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలను ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించారు.
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?