తెలంగాణ పోలీసులు రాష్ట్రంలో గుట్కా, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ శివారులో పార్టీల పేరుతో గంజాయి వాడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేసి పట్టుకుంటున్నారు. ఈ మేరకు శంషాబాద్ జోన్ డీసీపి ప్రకాష్ రెడ్డి అక్రమంగా గుట్కా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా శంషాబాద్ జోన్ పరిధి లోని పలు వ్యాపార సముదాయాల పై పోలీసుల దాడులు నిర్వహించారు.
Also Read : సీఎం జగన్ కాన్వాయ్ వెంట పరుగెత్తిన మహిళ.. ఎందుకంటే..?
అక్రమంగా గుట్కా విక్రయిస్తున్న వారిని పోలీసుల బృందం అదుపులోకి తీసుకున్నారు. గుట్కా విక్రయిస్తున్న 32 వ్యాపార సముదాయాలపై అక్రమ గుట్కా విక్రయాల సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. 24 వ్యాపార సముదాయాలపై కేసులు నమోదు చేసినట్లు, వారి వద్ద నుండి భారీగా గుట్కా ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.