కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించడాన్ని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తప్పుపట్టింది. ఇలా ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించడంతో డీలర్లందరికీ భారీగా ఆర్థిక నష్టాలు వచ్చాయని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ పేర్కొంది. ఈ అంశంపై చర్చించడానికి పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ శుక్రవారం రాష్ట్రస్థాయి వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఈ వర్చువల్ సమావేశానికి 18 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మే 31 న డీలర్లు ఎవ్వరూ చమురు కంపెనీల నుంచి పెట్రోల్‌ను కొనుగోలు చేయకుండా.. నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చింది. ‘నో పర్చేస్ డే’ అనే పేరున నిరసన వ్యక్తం చేయాలని టీపీడీఏ పిలుపునిచ్చింది. టీపీడీఏ ఇచ్చిన ఈ పిలుపుకు డీలర్లందరూ కచ్చితంగా కట్టుబడి వుండాలని అసోసియేషన్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. IOC, BPC & HPC యొక్క మొత్తం 7 సరఫరా స్థానాల్లో లోడింగ్ మరియు పంపకాలు జరగకుండా చూసుకోవాలని అసోసియేషన్ డీలర్లకు పిలుపునిచ్చింది.