Home
Tg Safe
Tg Safe News
-
Food Safety Raids : మిఠాయిల్లో బొద్దింకలు, ఈగలు.. నిజామాబాద్‌లో 13 సంస్థల లైసెన్సులు రద్దు
ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ, నాసిరకం ఆహార తయారీదారులపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (TG-SAFE) విరుచుకుపడింది. నవంబర్ 3న నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులతో కూడిన 14 ఎన్ఫోర్స్మెంట్ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. మసాలా దినుసులు, ప్యాకేజ్డ్ తాగునీరు, స్వీట్లు, హోటళ్లు, రెస్టారెంట్లు మరియు బేకరీలు సహా మొత్తం 28 ఆహార విక్రయ కేంద్రాలలో ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో అత్యంత దారుణమైన పరిస్థితులు వెలుగుచూశాయి. అపరిశుభ్రమైన వంటశాలలు,… -
Hyderabad: తెలంగాణలో ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలపై కొరడా.. 32 మెడికల్ షాపులకు నోటీసులు
Pharmacy Raids- Hyderabad: ఆన్లైన్ ఫార్మసీల ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఔషధ విక్రయాలపై తెలంగాణ ఆహార, నిత్యావసర ఔషధాల ప్రమాణాల ప్రాధికార సంస్థ (TG SAFE) డ్రగ్స్ విభాగం కొరడా ఝుళిపించింది. 2026 అక్టోబర్ 28న ‘క్యూర్’ (CURE) ప్రాంతం పరిధిలోని ఆన్లైన్ మెడిసిన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు, వాటి అనుబంధ ఫార్మసీలపై అధికారులు ఆకస్మిక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. టీజీ సేఫ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పోలీసులు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది సమన్వయంతో ‘డ్రగ్స్ అండ్… -
Hyderabad Fake Snacks Raid: పిల్లలు తినే స్నాక్సేనా ఇవి.? కాటేదాన్‌లో 55 టన్నులు సీజ్.!
స్నాక్స్ కాదు… అవి విషంతో సమానం.. ఆ స్నాక్స్ తింటే మన పిల్లల ఆరోగ్యం గోవిందా.. చౌకగా వస్తున్నాయని చెప్పి స్థానికంగా తయారీ అయిన స్నాక్స్ కొని తింటే అంతే సంగతులు.. బ్రాండెడ్ కంపెనీల పేరు తోటి స్నాక్స్ తయారు చేసి మార్కెట్ లో విక్రయిస్తున్న ముఠా ను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.. హైదరాబాద్ కేంద్రంగా తయారవుతున్న నకిలీ స్నాక్స్ ఫ్యాక్టరీ పైన అధికారులు దాడులు చేసి ఏకంగా నాలుగు యూనిట్లను వెంటనే సీజ్ చేశారు.. అంతేకాకుండా… -
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
ప్రముఖ పండుగలు, వేడుకల వేళ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్ల బాగోతం బట్టబయలైంది. భాగ్యనగరంలో ప్రజలు ఎంతో ఇష్టంగా తినే కోవా, స్వీట్ల తయారీ కేంద్రాలు అత్యంత అపరిశుభ్రంగా, రోత పుట్టించే వాతావరణంలో నడుస్తున్నట్లు ఆహార భద్రతా విభాగం తనిఖీల్లో వెల్లడైంది. తెలంగాణ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ అథారిటీ (TG SAFE) ఎన్ఫోర్స్మెంట్ వింగ్‌కు చెందిన అధికారులు, పోలీస్ సిబ్బందితో కూడిన ఏడు ప్రత్యేక బృందాలు నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మిక… -
TG SAFE: హైదరాబాద్‌లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
TG SAFE: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని డైరీ ప్రొడక్ట్స్ తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్ (TG SAFE), ఫుడ్ వింగ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. క్వాలిటీని గాలికొదిలేసి నాసిరకం ఉత్పత్తులను విక్రయిస్తున్న డైరీ సంస్థల తీరు ఈ తనిఖీల్లో వెలుగుచూసింది. మధుర, యశోద, బాలాజీ, జగన్నాథ్ డైరీ ప్రొడక్ట్స్ కేంద్రాలపై అధికారులు ముమ్మరంగా సోదాలు జరిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం 6 డైరీ యూనిట్లు, ఒక ట్రాన్స్పోర్ట్ కేంద్రంలో ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. -
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
TG SAFE : పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో నగరవాసుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ (TG SAFE), ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హైదరాబాద్ వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగరంలోని ‘సియుఆర్ఇ’ (CURE) జోన్ పరిధిలో ఉన్న 12 పేణీల (Peenilu) తయారీ ఖార్ఖానాలపై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పండుగ రోజుల్లో విరివిగా అమ్ముడయ్యే ఈ మిఠాయిలను నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తున్నట్లు… -
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
గచ్చిబౌలిలోని ప్రముఖ ‘అంతేరా’ (Antera) రెస్టారెంట్ నిబంధనల ఉల్లంఘనపై ఎన్టీవీ (NTV) ప్రసారం చేసిన వరుస కథనాలకు స్పందన లభించింది. అధికారులు ఫుడ్ లైసెన్స్ రద్దు చేస్తూ నోటీసులు ఇచ్చినా బేఖాతర్ చేస్తూ రెస్టారెంట్ నడుపుతున్న తీరుపై ఎన్టీవీ నిలదీయడంతో టీజీ సేఫ్ (TG SAFE) అధికారులు తక్షణమే స్పందించారు. అధికారుల పునఃచర్యలు, హెచ్చరికల నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నానికి అంతేరా రెస్టారెంట్ నిర్వాహకులు దిగివచ్చి, హోటల్‌ను పూర్తిగా మూసివేశారు. శనివారం నోటీసులు.. ఆదివారం యథేచ్ఛగా వ్యాపారం ఆహార… -
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎస్సెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) అధికారులు తీవ్రస్థాయిలో కొరడా ఝుళిపించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు , పోలీసు సిబ్బందితో కూడిన 10 ప్రత్యేక బృందాలు గచ్చిబౌలి, మాధాపూర్, హైటెక్ సిటీ తదితర కోర్ అర్బన్ రీజియన్‌లోని 20 ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి రాగా, తీవ్రమైన… -
Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
Hyderabad Food Safety: హైదరాబాద్ నగరంలోని పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (TG SAFE - Telangana Standards Authority for Food and Essential Drugs) అధికారులు విస్తృత స్థాయి ఆకస్మిక దాడులు నిర్వహించారు. నాణ్యత, పరిశుభ్రత నిబంధనలు పాటించకుండా వినియోగదారులకు కల్తీ, నాసిరకం ఆహారం వడ్డిస్తున్నారన్న ఫిర్యాదులతో 10 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలడంతో 11 ప్రముఖ… -
TG SAFE : కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 5 లైసెన్సులు సస్పెండ్..!
TG SAFE : హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు భారీ తనిఖీలు చేపట్టారు. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9న నిర్వహించిన ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్‌లో మొత్తం 20 ఫుడ్ సంస్థలను తనిఖీ చేశారు. ఇందులో రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు, హాస్టళ్లు ఉన్నాయి. తనిఖీల్లో పలు చోట్ల ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు. 20 సంస్థల్లో తనిఖీలు ఫుడ్ సేఫ్టీ…
తాజావార్తలు
-
Poonam Kaur : ముందుంది అసలు సినిమా.. పవన్ విడాకుల వేళ పూనమ్ కౌర్ ట్వీట్ కలకలం!
-
Qualcomm Layoffs: ఐఐటీ డిగ్రీ, రూ. 26 లక్షల ప్యాకేజ్.. లేఆఫ్స్‌లో రోడ్డున పడ్డ ఇంజనీర్!
-
Jaggareddy: సోనియాగాంధీ ఆత్మకథతో తెలుగులో సినిమా తీస్తా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
-
Rashmika: రష్మిక క్రేజ్‌కు వరుస బ్రేకులు.. ‘మైసా’తో బౌన్స్ బ్యాక్ అవుతుందా?
-
Gandhi Family: ఇందిరా గాంధీ – మేనక మధ్య విభేదాలకు అసలు కారణాలివే.. సోనియా ఆత్మకథలో కీలక విషయాలు!
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!