Nidamanoor SI: నల్లగొండ జిల్లా నిడమనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నారమ్మగూడెంలో గత 30న రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో మునగాల పద్మా ఫిర్యాదు మేరకు దుబ్బాకుల రాంరెడ్డి, దుబ్బాకుల కుశలవ రెడ్డి, వేముల సిద్దార్దరెడ్డిలపై నిడమనూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులపై 354, 326, 504, 506, R/w 34 IPC సెక్షన్ ల కింద కేసు నమోదు.. A-2,A-3 లు కుశలవ రెడ్డి, సిద్ధార్థ రెడ్డి లకు,జరిగిన ఘర్షణతో సంబంధం లేదని.. A-1 దుబ్బాకుల రామ్ రెడ్డి కొడుకు పురుషోత్తం రెడ్డి అలియాస్ రెక్కిరెడ్డి(ఇతను అమెరికాలో ఉంటున్నాడు) నిడమనూరు ఎస్ఐ శోభన్ బాబుకి విజ్ఞప్తి చేశారు. అయితే ఇదే అలుసుగా భావించిన ఎస్సై శోభన్ అలియాస్ రీక్కిరెడ్డితో వాట్సాప్ చాట్ చేశాడు. A-2, A-3 లను తప్పించడానికి రెండు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రెండు లక్షల ఇవ్వలేనని 10 లేదా 20 వేలు ఇస్తానని అన్నాడు.
దీంతో ముష్టి వేస్తున్నావా అంటూ వాట్సప్ చాట్ లో రిక్కిరెడ్డితో చాట్ చేసిన ఎస్ఐ.. ఆ తర్వాత ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అడిగినంత ఇవ్వలేదని నేరం చేయని A-2, A-3 లను కేసులో ఇరికించారని బందువుల ఆరోపిస్తున్నారు. కేసు నుండి తప్పించడానికి నల్గొండ జిల్లా నిడమానూరు ఎస్సై శోభన్ బాబు 2 లక్షలు డిమాండ్ చేసినట్లు వాట్సప్ చాట్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. 20వేలు ఇస్తా అని బాధితుల తరుపున అమెరికాలో ఉన్న పురుషోత్తమ్ రెడ్డి కమిట్మెంట్ ఇచ్చినా ససేమిరా అన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షన్నర ఇవ్వాల్సిందే అని ఎస్సై డిమాండ్ చేశాడని వాపోయారు. A-1 దుబ్బాకుల రామ్ రెడ్డి కుమారుడు పురుషోత్తం రెడ్డి అలియాస్ రిక్కి రెడ్డి తో ఎస్సై వాట్సప్ చాట్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్సై తన డిపార్ట్మెంట్ నెంబర్ 87126….. తో USA లో ఉన్న బాధితుడి కొడుకు +1(646)934…. రెక్కిరెడ్డి తో చాట్ చేసినట్లు వాట్సప్ చాట్ బయపటడింది.
Read also: Love Affair: ఒకరితో లవ్ మరొకరితో ఎఫైర్.. ప్రియురాలు బర్త్ డే రోజే ప్రియుడు సూసైడ్
వాట్సాప్ చాట్ లో ఏముందంటే..
ఎస్సై శోభన్ బాబు: నేను అడిగినంత ఇవ్వలేదు అనుభవించండి… నా మీద కంప్లైంట్ ఇస్తే ఊరుకోను..
రిక్కి రెడ్డి : 10, 20 వేలు ఇస్తా..
ఎస్సై శోభన్ బాబు: 10, 20 నాకు ముష్టి ఇస్తున్నావా..
రిక్కి రెడ్డి : డీఎస్పీ, ఎస్పీకి చెప్తా
ఎస్సై శోభన్ బాబు: డీఎస్పీ, ఎస్పీకి చెప్తాను అని బెదిరించొద్దు అర్థమైందా.. ఎక్కువ చేస్తే ఛార్జ్ షీట్ లో చూపిస్తా…ఫైనల్ గా 1.5 పంపించు… లేదంటే USA లో ఉన్న నిన్ను ఇరికిస్తాను.. దిక్కు ఉన్న దగ్గర చెప్పుకో అంటూ ఎస్సై చాట్ ఇప్పుడు బట్టబయలైంది.
A-1 దుబ్బాకుల రామ్ రెడ్డి కొడుకు పురుషోత్తం రెడ్డి అలియాస్ రిక్కీ రెడ్డితో ఎస్సై శోభన్ బాబు వాట్సప్ చాటింగ్ బయటకు రావడంతో ఎసై బాగోతం బట్టబయలైంది. డిపార్ట్మెంట్ సెల్ నంబర్ నుండి యూఎస్ లో ఉన్న పురుషోత్తం రెడ్డి అలియాస్ రెక్కిరెడ్డితో మొత్తం వ్యవహారాన్ని ఎస్ఐ చాట్ చేసినట్లు తెలుస్తోంది. ఎస్సై చాట్ చేసిన అంశాలను తన మొబైల్ లో బాధితుడి కొడుకు స్క్రీన్ రికార్డు చేయడంతో అసలు గుట్టు రట్టైంది. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. లంచం అడగడం నేరం అంటూనే ఎస్సై బేరసారాలు బయటకు రావడంతో పోలీసు శాఖ షాక్ తింది. మరి ఎస్సై శోభన్ బాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ప్రశ్నగా మారింది. నిందితులను నేరస్తులుగా మార్చి వారి వద్ద డబ్బులు డిమాండ్ చేయడం ఏంటని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు రక్షణ కల్పించాల్సిన ఎస్సై ఇలా ప్రజలను డబ్బుకోసం పట్టి పీడిస్తుంటే పై అధికారులు ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి వారిని తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Bhatti Vikramarka: నిలకడగా భట్టి విక్రమార్క ఆరోగ్యం.. సాధారణ స్థితికి బీపీ, షుగర్ లెవెల్స్