RTC Bus Conductor: వికారాబాద్ జిల్లా తాండూర్ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సంతోష్ కుమార్(38 ) నిన్న రాత్రి తాండూర్ నుంచి బాషీరాబాద్ మండలం క్యాద్గిరా గ్రామానికి వెళ్లే బస్సులో విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే కన్నుమూశారు.. గుండెపోటు రావడంతో బస్సులోనే స్పృహ తప్పి పడిపోయిన ఆయన్ని.. గమనించిన ప్రయాణికులు, బస్సు డ్రైవర్ అదే ఆర్టీసీ బస్సులో అతని చికిత్స నిమిత్తం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అయితే, కండక్టర్‌ని పరిశీలించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందాడు అని నిర్ధారించారు.. ఈ విషయం తెలుసుకున్న తోటి కార్మికులు ఆస్పత్రికి చేరుకొని కండక్టర్ మృతికి డీఎం ఒత్తిడే కారణం అంటూ ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో డిపో మేనేజర్ సమత అక్కడికి చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి అంబులెన్స్ లో మృతుని స్వగృహానికి తరలించారు..
Read Also: Rashmi Gautham: బిగ్ బాస్ కు రష్మీ.. కానీ..?
అయితే, పని ఒత్తిడి వల్లే తోటి కార్మికుడు మృతి చెందాడని ఆర్టీసీ సిబ్బంది గుసగుసలాడుకున్నారు.. ఈ విషయం మీడియా ముందుకు వచ్చి చెబితే మళ్ళీ డీఎం తమను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తుందని వాపోయారు.. డిపో మేనేజర్ కొత్తగా వచ్చినప్పటి నుంచి తమపై అదనంగా పనిబారం మోపుతున్నారని.. మృతి చెందిన కండక్టర్ చిన్న వయసు కావడం.. అతని ఇద్దరు పిల్లలను ప్రభుత్వమే ఆదుకోవాలని తోటి కార్మికులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై డీఎంను వివరణ కోరెందుకు ప్రయత్నించగా తాను బిజీగా ఉన్నానంటూ మాట మార్చేసే ప్రయత్నం చేశారు. అయితే. విధి నిర్వహణలు గుండెపోటుతో సంతోష్ కుమార్ మృతిచెందడానికి ఒత్తిడే కారణమని ఆరోపిస్తున్నారు తోటి కార్మికులు.