ఏపీలో పేకాటరాయుళ్లు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం సాగుతోంది. వీరికి పోలీసుల మద్దతు తోడవుతోంది. ఇంకేముంది.. మూడు ముక్కలు.. ఆరు ఆటలు అన్నట్టుగా సాగుతోంది యవ్వారం. ఓవైపు తెలంగాణలో పేకాట క్లబ్బుల్ని ఉక్కుపాదంతో అణచివేస్తే.. ఏపీలో మాత్రం పేకాటను పెంచి పోషించి.. త్వరలో రిక్రియేషన్ క్లబ్బుల స్థాయికి తీసుకెళ్లే యజ్ఞం శ్రద్ధగా సాగుతోంది. పైగా కొందరు నేతలు మా ప్రాంతంలో పేకాట కామన్ అంటూ కామెంట్లు చేయడం.. చతుర్ముఖ పారాయణానికి మరింత కిక్ ఇస్తోంది. ఏపీలో…
ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో జోరుగా పేకాట స్థావరాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరిగేర వద్ద పేకాట స్థావరంపై కర్ణాటక పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన 19 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో పలువురు వైసీపీ నేతలతో పాటు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ బాలాజీ కూడా ఉన్నాడు. అతడు వైసీపీ నేతలతో కలిసి పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుతోంది. కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్న…
హైదరాబాద్ నగరంలో పేకాట రాయుళ్లు రెచ్చిపోతున్నారు. లోధా అపార్ట్మెంట్స్ లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 13 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టుబడ్డారు. పక్కా సమాచారంతో మాదాపూర్ డీసీపీ ఆధ్వర్యంలో పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడిలో 13 మంది పేకాట ఆడుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. పోలీసులకు పట్టుబడిన వారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా పోలీసులు గుర్తించారు.…
హీరీ నాగశౌర్యకు చెందిన ఓ ఫాంహౌస్‌లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేయగా గుత్తా సుమన్ అనే వ్యక్తి ఫాం హౌస్‌లు లీజుకు తీసుకొని క్యాసినో నిర్వహిస్తున్నట్లు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో విచారణ కొనసాగుతుండగా బేగంపేటలో పేకాట ఆడుతూ పట్టుబడ్డారు మరికొందరు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అరవింద్ అగర్వాల్ అనే వ్యక్తి ప్రతి పండుగ లకు ముఖ్యమైన రోజుల్లో క్యాసినో నిర్వహిస్తున్నట్లు,…
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు చేస్తున్నారు. హీరో నాగశౌర్య ఫాంహౌస్ లో పేకాటరాయుళ్లను పట్టుకున్నారు.25 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులను చూసి బడాబాబులు పారిపోయారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని నార్సింగ్ మండలం మంచిరేవుల గ్రామంలో పేకాట ఆడుతున్నారు. ప్రముఖ యువహీరో నాగ శౌర్య ఫాంహౌస్ లో పేకాట ఆడుతున్నారు. ఏకకాలంలో ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించడంతో 25 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖులు కలిసి పేకాట ఆడారు.…