Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News New Tension For Teachers With Biometric Attendance

Biometric Attendance: విద్యాశాఖలో బయోమెట్రిక్.. ఉపాధ్యాయుల్లో కొత్త టెన్షన్‌..

Published Date :November 1, 2022 , 10:40 pm
By Sudhakar Ravula
Biometric Attendance: విద్యాశాఖలో బయోమెట్రిక్.. ఉపాధ్యాయుల్లో కొత్త టెన్షన్‌..
  • Follow Us :
  • google news
  • dailyhunt

సర్కారు బడుల్లో జియో అటెండెన్స్ తప్పనిసరి చేస్తూ.. తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. సర్కారు ఆదేశాలతో జియో అటెండెన్స్ అమలు చేస్తున్నారు అధికారులు. నిజామాబాద్‌ జిల్లాలో 1156 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 5వేలకు పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. చాలా స్కూళ్లలో ప్రభుత్వ ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని .. ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో విద్యాశాఖ బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని తప్పనిసరి చేసింది. సర్కారు నిర్ణయంతో ఉపాధ్యాయుల్లో కొత్త టెన్షన్‌కు మొదలైంది. ఇటీవల డిచ్‌పల్లిలో ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లు డుమ్మా కొట్టారు. గ్రామస్థులు పాఠశాలకు తాళం వేసిన ఆందోళనకు దిగారు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు ఇకపై సమయానికి పాఠశాలలకు వెళ్లాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. సర్కారు నిర్ణయాన్ని చాలా మంది ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నా.. బయటకు మాత్రం మంచి నిర్ణయం స్వాగతిస్తున్నామంటున్నారు.

Read Also: Monkey Drinking beer: వైన్స్‌లో దూరి మద్యం ఎత్తుకెళ్తున్న కోతి..! బీరు భలేగా లాగిస్తుందిగా

సర్కారు బడుల్లో పనిచేసే ఉపాధ్యాయులు.. నిర్ణీత సమయానికి స్కూల్ కు హాజరయ్యే విధంగా అమలు చేస్తున్న జియో అటెండెన్స్‌కు.. సాంకేతిక సమస్యలు గుదిబండగా మారాయి. చాలా మందికి సర్వర్ సమస్య ఉత్పన్నం అవుతోంది. ఫలితంగా స్కూల్ కు నిర్ణీత సమయానికి వచ్చినా.. హాజరు వేసుకోలేక ఇబ్బందులు పడుతున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన ఉపాధ్యాయులు విధులకు హాజరుకాకుండా డుమ్మాలు కొట్టడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. జియో అటెండెన్స్‌పై ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు… ఐతే హాజరుశాతం అంతంతమాత్రంగానే ఉంటుంది. జిల్లాలో 5,700లకు పైగా ఉపాధ్యాయులు ఉండగా.. జియో అటెండెన్స్‌లో 50 శాతం మంది మాత్రమే హాజరు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్‌ ప్రాబ్లం రావడంతో చాలామంది ఉపాధ్యాయులు ఈ యాప్‌లో రిజిస్టర్‌ చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పాఠశాల ప్రారంభమైన మొదటి పిరియడ్‌లోనే ఉపాధ్యాయులు తమ హాజరును నమోదు చేసుకోవాలి. సెల్ఫీ ఫొటోతో అటెండెన్స్‌ నమోదవుతుంది.. కాబట్టి పాఠశాల ప్రాంగణంలోనే ఉపాధ్యాయులు తమ జియో అటెండెన్స్‌ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అయితే,. కొందరికి మోదం మరికొందరికి ఖేధంగా ఉన్న ఈ విధానం ఏమేరకు సక్సెస్ అవుతుందో వేచిచూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • biometric attendance
  • new tension
  • Nizamabad
  • Teachers
  • telangana

తాజావార్తలు

  • Ranveer Singh : ధురంధర్ – 2.. రెండు వేల కోట్ల మార్క్ అందుకోవడం అసాధ్యం

  • YSR Padayatra Completes 23 Years: దివంగత నేత వైఎస్‌ పాదయాత్రకు 23 ఏళ్లు.. జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

  • JD Vance: ఇరాన్ పొరబడుతోంది.. ఒప్పందం లెబనాన్‌కు వర్తించదు

  • Iran: మళ్లీ మూతపడ్డ హార్ముజ్ జలసంధి.. ఇరాన్ యు-టర్న్ వెనుక అసలు కారణం ఇదే!

  • COP33 Climate Summit 2028: COP33 వాతావరణ సదస్సు.. ఆతిథ్యం ప్రతిపాదనను ఉపసంహరించుకున్న భారత్

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions