Secunderabad: సికింద్రాబాద్ చోరీ కేసును చేధించిన పోలీసులు.. 9 మంది నేపాలీ గ్యాంగ్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Secunderabad: సికింద్రాబాద్ సింధీ కాలనీలో ఈ నెల 9న జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేందించారు. ఒక వ్యాపారి ఇంట్లో రూ.5 కోట్ల సొత్తు చోరీ.. ఈ కేసులో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేపాల్‌కు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో నమ్మకంగా పనిచేస్తూ తన ముఠాతో కలిసి ఈ భారీ దోపిడీకి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. వ్యాపారి అపార్ట్మెంట్లో గత ఐదేళ్లుగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన శంకర్ మాన్ సింగ్ అలియాస్ కమల్.. మరో 12 మందితో కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డాడని చెప్పాడు. 41 లక్షల నగదు, 2.8 కిలోల బంగారం, 18 ఖరీదైన వాచీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం 13 మంది నిందితుల్లో 9 మందిని అదుపులోకి తీసుకున్నామని, మరో నలుగురు పరారీలో ఉన్నారని చెప్పారు. ముంబైకి చెందిన ఓ ఏజెన్సీ నేపాలీలకు ఉపాధి కల్పిస్తున్నట్లు గుర్తించారు.
Read also: Talasani Srinivas Yadav: బీసీ నేతలపై వ్యక్తిగత దాడులు చేస్తే చూస్తూ ఊరుకోము
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
వ్యాపారవేత్త రాహుల్ గోయల్, అతని ముగ్గురు సోదరులు సికింద్రాబాద్‌లోని పీజీ రోడ్డు సింధీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఈ సోదరులు ఇనుము వ్యాపారం చేస్తున్నారు. నేపాల్‌కు చెందిన కమల్ గత ఐదేళ్లుగా వారి అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగను పురస్కరించుకుని రాహుల్ కుటుంబం ఈ నెల 9న హైదరాబాద్ నగర శివార్లలోని తమ ఫామ్ హౌస్ కు వెళ్లింది. రాహుల్ మరుసటి రోజు అంటే జూలై 10 సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చి చూసే సరికి మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టి కనిపించాడు. అక్కడ వాచ్మెన్ కమల్ కూడా కనిపించలేదు.
Read also: Pawan Kalyan: కేంద్ర మంత్రి మురళీధరన్ ఇంటికి పవన్ కళ్యాణ్
దీంతో గోయల్ ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దోపిడీ జరిగిన ఇంటిని పరిశీలించారు. గోయల్ కుటుంబానికి వాచ్మెన్ కమల్ సన్నిహితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఐదేళ్లుగా పనిచేస్తున్నందున వాచ్మెన్పై గోయల్‌కు పూర్తి నమ్మకం ఉంది. అయితే బోనాల సందర్భంగా బయటకు వెళ్తున్నారని పసిగట్టిన కమల్.. దొంగతనాలకు పాల్పడే నేపాల్ గ్యాంగ్ కు సమాచారం అందించాడు. రెండు కార్లలో వచ్చిన నిందితులు విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలు, నగదు, వాచీలు ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు ఇంట్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దోపిడీ అనంతరం ముందుగా బుక్ చేసుకున్న బస్సులో నేపాలీ ముఠా పారిపోయింది. పోలీసులు ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసి నేపాల్ సరిహద్దు దాటకముందే అరెస్ట్ చేశారు.
Hijras: ఛీ ఛీ.. హిజ్రాకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!