Naveen Reddy Father: భాగ్యనగరంలో సంచలనం రేకెత్తించిన దంత వైద్య విద్యార్థిని అపహరణ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి సహా ఆరుగురు నిందితులకు ఇబ్రహీంపట్నం కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.. అయితే నవీన్ రెడ్డిని అదుపులో తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరతలిస్తుండగా పోలీసులు నవీన్ రెడ్డిని తరలిస్తున్న సమయంలో తండ్రి తన కుమారుడ్ని కలిసేందుకు ప్రయత్నించాడు. అయితే తండ్రిని అడ్డుకున్నారు పోలీసులు. అయ్యా నాబిడ్డను వదిలేయండి అయ్యా.. అయ్యో..కొడకా అంటూ నవీన్ దగ్గరకు వెళ్లి తాకేందుకు ముందుకు వెళ్లాడు నవీన్ రెడ్డి తండ్రి. అయితే పోలీసులు చేతులు అడ్డుపెట్టారు. నవీన్ ను కలిసేందుకు కూడా ఇవ్వలేదు. నిందితుడు నవీన్ రెడ్డి సార్ నేను నాతప్పు ఒప్పుకుంటా ప్లీజ్ అంటున్నా పోలీసులు తన నోరు నొక్కి ముందుకు లాక్కుంటూ తీసుకెళ్లారు. దీంతో అక్కడున్న నవీన్ రెడ్డి తండ్రి తల్లడిల్లారు. కొడుకా అంటూ.. నాబిడ్డ తప్పు ఒప్పుకుంటాడయ్యా వదిలేయండి అంటూ వారి మాటలకు నిందితుడు నవీన్ కంటతడి పెట్టుకున్నాడు.
అయితే..Ntv తో నవీన్ రెడ్డి తల్లి నారాయణమ్మ మాట్లాడుతూ.. నా కొడుకు వీడియో లో చెప్పింది అంతా నిజమే అన్నారు. వైశాలి నా కొడుకు నవీన్ తో చాలా సన్నిహితంగా వుందని అన్నారు. ఇష్టం లేనప్పుడు నా కొడుకుతో టూర్ లకు ఎందుకు వెళ్ళింది ? అంటూ ప్రశ్నించారు. వైశాలి కుటుంబసభ్యులను నేను కూడా కలిశానన్నారు. వైశాలి మన ఇంటి కోడలు అని నవీన్ నాతో చెప్పాడన్నారు. నా కొడుకు ఆవేదన ను సమాజం అర్థం చేసుకోవాలని అన్నారు.
నాకు అమ్మాయి వుంటే ఇలాగే మాట్లాడతానా అని వైశాలి అంటుందని, నాలాంటి కొడుకు వైశాలి తల్లికి వుంటే ఆ బాధ తెలిసేదని తన ఆవేదన వ్యక్తం చేసింది
Read also: Ashwini Vaishnaw: వృద్ధులకు రైల్వే మంత్రి షాక్.. రాయితీలేనట్లే..
నవీన్ రెడ్డితో సహా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.. అయితే నవీన్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చే సమయంలో 58 నిమిషాల వీడియో విడుదల చేస్తే.. అందులో రెండు నిమిషాలే పోలీసులు మీడియాకు విడుదల చేశారని నవీన్ రెడ్డి ఆరోపించాడు. భయం వేస్తోందంటూ కన్నీరు పెట్టుకున్నాడు. గతంలో నవీన్ రెడ్డిపై వరంగల్, విశాఖపట్నం, ఆదిభట్లలో నమోదైన వాటితో కలిపి 4 కేసులు ఉన్నట్లు తెలిపిన పోలీసులు ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని కస్టడీకి తీసుకొని విచారించేందుకు కోర్టులో నేడు పిటిషన్ దాఖలు చేయనున్నారు. అయితే.. పరారీలో ఉన్న రుమన్, పవన్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్టు పోలీసులు వివరించారు.
Vizag Lady Viral Photos: విశాఖలో యువతి వీరంగం.. వైరల్ అవుతున్న ఫోటోలు