Navaratri 7th Day: దేవీ నవరాత్రులలో ఏడవ రోజు, ఆశ్వయుజ శుద్ధ సప్తమి, మణిద్వి నివాసి అయిన పరాంబిక శనివారం నాడు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి రూపంలో పూజించబడుతుంది. ఈ తల్లి త్రిపురత్రయంలో రెండవ శక్తి రూపం. అందుకే శరన్నవరాత్రులలో వచ్చే పంచమిని లలితా పంచమి అని కూడా అంటారు. బెత్తం, విల్లు, ధనుస్సు, అంకుశం ధరించి దేవి లక్ష్మీ, సరస్వతి సమేతంగా కుడి, ఎడమల సేవలు నిర్వహిస్తుండగా శ్రీ లలితా పరాభట్టారిక భక్తురాలు ఆటంకాలు తొలగించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. శ్రీ లలితాదేవి అలంకారంలో అమ్మవారిని సహస్రనామ, అష్టోత్తర నామాలతో కుంకుమతో పూజించి ముత్తైదువులకు తాంబూలాలు ఇస్తారు. ముత్తైదువులను పిలిచి సువాసిని పూజలు నిర్వహిస్తారు.
కైలాస గౌరీ నోము కానీ, గ్రామ కుంకుమ నోము కానీ నోచుకున్న వారు చాలామంది ఈరోజు ఉద్యాపన చేస్తారు. మరికొందరు తమ ఇళ్లలో సామూహిక లక్ష కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారన్నారు. బొమ్మలకొలువులు పెట్టుకున్నవారు పేరంటాలు చేసుకుంటారు. శ్రీ లలితా దేవి తనను ఆరాధించే భక్తుల పేదరికాన్ని, దుఃఖాలను నాశనం చేస్తుంది. కుంకుమ పూజ చేసిన వారికి అమ్మవారు మాంగల్యం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీలలితా దేవిని మనస్ఫూర్తిగా తలచుకుంటూ పంచమినాడు వీలైనన్ని సార్లు ఓం ఐం హ్రీం, శ్రీ శ్రీ మాత్రే నమః అని జపిస్తే అమ్మ మాతృమూర్తియై చల్లగా చూస్తారని భక్తుల నమ్మకం. ఈరోజు ధరించవలసిన వర్ణం బంగారు. అమ్మవారికి పులిహోర, పెసర బూరె నైవేద్యంగా పెడతారు.
తెలంగాణలో దేవీ నవరాత్రులు..
* రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు మూల నక్షత్రం సందర్భంగా కాళరాత్రి అవతార అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు.
* నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి శ్రీ శారదీయ శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. 7వ రొజు అమ్మవారు కాళరాత్రి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అష్టోత్తర నామార్చన చతుషష్టి ఉపచార పూజల నిర్వహణ మల్లె పుష్పార్చన కిచిడి నివేదన అర్పించారు.
* కొత్తగూడెం జిల్లా భద్రాద్రిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీసీతారామచంద్ర స్వామివారి నవరాత్రుల్లో భాగంగా నేడు ఐశ్వర్య లక్ష్మి అలంకారంలో భక్తులకు అమ్మవారిగా దర్శనం ఇస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో దేవీ నవరాత్రులు..
* విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఏడవ రోజుకి చేరుకున్న దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉన్నది కాబట్టి త్రిపురసుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
* శ్రీశైలంలో 7వరోజు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నారు. సాయంత్రం కాళరాత్రి అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిస్తున్నారు. గజవాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలందుకోనున్న ఆది దంపతులు. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవం ఊరేగింపులో భక్తులుకు కనువిందు చేస్తున్నారు.
* కర్నూలు జిల్లా కోడుమూరు శ్రీ వల్లెలాంబదేవి ఆలయంలో శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
దేవీ నవరాత్రుల్లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆలయ అధికారులు అయ్యారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు సమకూరుస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘనలకు తావు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
Science Of Chilli Heat: కారం తిన్న తర్వాత నోరు ఎందుకు మండుతుందో తెలుసా ?