రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసు వ్యవహరంలో నిందితుడిగా ఉన్న నందకుమార్ ను గత నెలలో భూవివాదం కేసులో బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే ఇవాళ చంచల్ గూడ జైల్లో ఉన్న నందకుమార్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముఖ్యమంత్రి ఇచ్చిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటామని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి ఇచ్చిన ఎవిడెన్స్‌ను చూసి తదుపరి విచారణ చేపడుతామని కోర్టు పేర్కొంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిన కేసులో కేరళకు చెందిన తుషార్‌ను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.రెండు రోజుల క్రితం తెలంగాణ హైకోర్టులో తుషార్ పిటిషన్ దాఖలు చేయగా, ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు తుషార్‌ను అరెస్టు చేయవద్దని సిట్‌ను ఆదేశించింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇవాళ విచారణకు రావాలని నలుగురికి సిట్ నోటీసులు పంపింది. ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉదయం 10.30 కు విచారించనుంది. ఇవాళ ఎమ్మెల్యే ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సహా నలుగురు కీలక నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించనుంది.
తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోల వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేవారు. తనఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నానే అనుమానం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మొదట తుషార్ పేరు ప్రస్తావించారని అనంతరం రాజ్‌భవన్ పేరు కూడా ప్రస్తావించారని గవర్నర్ తెలిపారు.