రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసు వ్యవహరంలో నిందితుడిగా ఉన్న నందకుమార్ ను గత నెలలో భూవివాదం కేసులో బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే ఇవాళ చంచల్ గూడ జైల్లో ఉన్న నందకుమార్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.