వరంగల్ లో అర్ధరాత్రి రోడ్డుపై మద్యం మత్తులో యువకుల హల్‌చల్
వరంగల్ లోని పోచమ్మ మైదాన్ లో యువకుల హల్ చల్ చేశారు. మద్యం మత్తులో విచక్షణారహితంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. నడిరోడ్డుపై నానా హంగామా చేశారు. మద్యం మత్తులో వున్న యువకులు నడిరోడ్డుపై రాగానే మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడులు చేసుకున్నారు. చేతికి అందినదానితో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముందుగా మందుబాబులను సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇక గత్యంతరం లేక మద్యం మత్తులో వున్న యువకులను చెదరగొట్టారు. ఎంత చెప్పిన వినకపోవడంతో.. పోలీసుల లాఠీకి పని పెట్టారు. యువకులు ఫుల్ గా మద్యం సేవించిన యువకులు మాట మాట పెరిగి ఈఘటనకు దారితీసిందని పోలీసులు చెబుతున్నారు.
ఎల్‌బినగర్‌లో మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు..
సైబరాబాద్ కమీష్నరేట్ పరిధిలో వరస చైన్ స్నాచర్ లు హల్ చల్ చేసి గంట వ్యవధిలో 6 చోట్ల చైన్ స్నాచింగ్ కి పాల్పడిన ఘటన మరివకముందే మళ్లీ ఇలాంటి ఘటనలే చోటుచేసుకోవడంతో నగర ప్రజలు భయాందోళన గురవుతున్నారు. రోజుకో ప్రదేశం మార్చి మహిళలకు వనుకు పుట్టిస్తున్నారు. ఈసారి ఎల్‌బినగర్‌లో చైన్ స్నాచర్లు తెగబడ్డారు. బ్యాగును భుజాన వేసుకుని వెళుతున్న 50ఏళ్ల వృద్ధురాలిని టార్గెట్ చేశారు. వారి ఎదురుగా వెళుతూ తన మెడలో గొలుసు వుందని గమనించారు. కారు పక్కన బైక్ ఆపి ఆమె మెడలో వున్న బంగారం గొలుసును తెంచుకుని అక్కడ నుంచి పరారయ్యాడు. ఆమె అరిచినా ప్రయోజనం లేకుండా పోయింది. లబోదిబోమంటున్న బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. రెండు తులాల బంగారం గొలుసు తెంపుకెళ్లారని వాపోయింది. ఎల్.బి. నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫోటేజ్ ఆధారంతో దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వరుస చైన్ స్నాచింగ్ లతో పోలీసులకు సవాల్ గా మారింది.
కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు.. యూ లవ్ మీ.. ఐ లవ్‌యూ అనేలా ఉండాలి..!!
టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సేవ చేయాలంటే నేనే సామంతరాజును అని ఫీల్ కాకూడదని సూచించారు. తానే ఆరుసార్లు ఎమ్మెల్యే అవ్వాలి.. తానే 8 సార్లు మంత్రి అవ్వాలంటే కుదరదన్నారు. ప్రజలు మెచ్చేలా పాలన చేయాలని కేశినేని నాని హితవు పలికారు. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అసలు ఏ పార్టీలో ఉన్నారని ఆయన ప్రశ్నించారు. తానే రాజునని ఫీల్ అయితే ప్రజలు కృష్ణానదిలోకి ఈడ్చి కొడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
హైకోర్టు సంచలన తీర్పు.. తండ్రి అప్పును కొడుకు తీర్చాల్సిందే..
తండ్రి ఆస్తులను పంచుకుంటారు కానీ.. అప్పులను పంచుకోరు కొడుకులు. తండ్రి చేసిన అప్పులతో తనకు ఏం సంబంధం ఉందని ఉల్టా ప్రశ్నిస్తుంటారు. నమ్మి అప్పు ఇచ్చిన వ్యక్తిని నట్టేట ముంచుతారు. అప్పు తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఇక అంతే సంగతులు. కొడుకులను అప్పు చెల్లించాలని కోరితే..తనకు ఆ అప్పు గురించి తెలియదని..నన్నడిగి అప్పు చేశాడా..? అంటూ ఎదురు ప్రశ్నించడం పలు సందర్భాల్లో మనం చూసే ఉంటాం. అయితే అలాంటి కొడుకులకు దిమ్మతిరిగిపోయేలా కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
నేడు రివర్ క్రూయిజ్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రపంచంలోనే అతి పొడవైన నదీ యాత్రను ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దీనికి వారణాసి వేదిక కానుంది. ఎంవీ గంగా విలాస్ అనే నౌకను వీడియో లింక్ ద్వారా ప్రారంభించనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ గా గుర్తింపు పొందింది. షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర మంత్రులు ఈ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. వారణాసి నుంచి బయలుదేరే ఈ నౌక బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోని దిబ్రూఘడ్ చేరుకుంటుంది. మొత్తం యాత్రకు 51 రోజలు సమయం పడుతుంది. 3200 కిలోమీటర్లు ప్రయాణించనుంది. వారణాసి మీదుగా పాట్నా, కోల్‌కతా, బంగ్లాదేశ్, గౌహతి, దిబ్రూగర్ వెంబడి నౌక పూ్రయాణిస్తుంది. మూడు అంతస్తులు ఉండే ఈ నౌక పొడవు 62 మీటర్లు, వెడల్పు 12 మీటర్లు ఉంటుంది. మొత్తం 27 నదీ వ్యవస్థల గుండా ప్రయాణం సాగనుంది. భారతదేశం, బంగ్లాదేశ్ కళలు, సంస్కృతి, చరిత్రను తెలుసుకునేందుకు విదేశీ పర్యాటకులకు ఈ నదీయాత్ర ఉపయోగపడనుంది. దేశంలో క్రయీజ్ పర్యటకానికి ఇది సహకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
భారత ఛానెళ్లను ప్రసారం చేస్తున్న కేబుల్ ఆపరేటర్లపై పాక్ ప్రభుత్వం చర్యలు..
దాయాది దేశం పాకిస్తాన్, భారతదేశం పట్ల నిలువెల్లా వ్యతిరేకతను అవలంభిస్తోంది. అక్కడి ప్రజలు తీవ్ర ఆహార సంక్షోభంలో ఉన్నా కూడా అవేవీ పట్టించుకోకుండా భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా భారత కంటెంట్ ప్రసారం చేస్తున్న కేబుల్ ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటోంది. పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యలేటరీ అథారిటీ నలుగురు కేబుల్ ఆపరేటర్లపై కేసులు పెట్టింది. చట్టవిరుద్ధంగా భారతీయ ఛానెళ్లను ప్రసారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు అవలంభించబోతోంది. పాక్ వాణిజ్య నగరం అయిన కరాచీలోని షార్జా కేబుల్ నెట్వర్క్, కరాచీ కేబుల్ సర్వీసెస్, న్యూ శాటిలైట్ కమ్యూనికేషన్స్, స్టార్ డిజిటల్ కేబుల్ నెట్వర్క్ భారతీయ కంటెంట్ ను ప్రసారం చేస్తుండటంతో వాటిని సీజ్ చేసింది. పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని వారిపై చర్యలు ప్రారంభించింది. దేశంలోని కేబుల్ ఆపరేటర్లందరూ భారతీయ ఛానెళ్లు, కంటెంట్ ను తక్షణమే నిలిపివేయాలని హెచ్చరించింది.
చరిత్ర సృష్టించిన టీమిండియా ప్రత్యర్థిపై..
కోల్‌కతా వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో అద్భుత విజయం సాధించిన టీమిండియా వన్డే సిరీస్‌తో పాటు ఓ అరుదైన ఘనతను కూడా సాధించింది. ఈ విజయంతో వన్డే ఫార్మాట్‌లో ఓ ప్రత్యర్థి జట్టుపై అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది. శ్రీలంకపై వన్డేల్లో భారత్‌కు ఇది 95వ విజయం. గతంలో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా సాధించిన 95 వన్డేల విజయ రికార్డును తాజాగా టీమిండియా సమం చేసింది. ఈ జాబితాలో భారత్-ఆస్ట్రేలియా సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. శ్రీలంకపై పాకిస్థాన్ 92 విజయాలను నమోదు చేసింది.
మాస్ ముగిసింది… ఇక క్లాస్ టైం వచ్చింది…
పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ తో బ్యాక్ టు బ్యాక్ లవ్ స్టొరీ సినిమాలు చేసి హిట్స్ హీరో నాని. చిరు, రవితేజల తర్వాత బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరోగా పేరు తెచ్చుకున్న నాని, ఇప్పటివరకూ టాలీవుడ్ కే పరిమితం అయ్యాడు. ఈసారి మాత్రం టాలీవుడ్ నుంచి టోటల్ ఇండియా తన మార్కెట్ ని స్ప్రెడ్ చెయ్యాలి అనుకుంటున్నాడు. అందుకే అందరికీ కనెక్ట్ అయ్యే యూనివర్సల్ కంటెంట్ తో ‘దసరా’ సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో నాని పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. సింగరేణి నేపధ్యంలో తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నాని ట్వీట్ చేశాడు. దసరా సినిమా కోసం గడ్డం పెంచి రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించిన నాని… గడ్డం తీసేసి క్లీన్ షేవ్ లోకి వచ్చేసాడు.
Kesineni Nani: టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు.. యూ లవ్ మీ.. ఐ లవ్‌యూ అనేలా ఉండాలి..!!