డ్రగ్స్ కేసు… కెల్విన్‌కు నాంపల్లి కోర్టు సమన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంచలనంగా మారిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఉన్న కెల్విన్‌కు నాంప్లి కోర్టు సమన్లు జారీ చేసింది.. అయితే, ఈ సమన్లు బోయిన్పల్లి కేసులో జారీ అయ్యాయి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కెల్విన్‌ను 2016లో బోయిన్‌పల్లిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేవారు.. అతడి దగ్గర ఎల్ఎస్డీ రకం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల వివరాలతో 2016 ఆగస్టులో కెల్విన్‌పై బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సీసీఎస్‌లోని నార్కోటిక్స్ విభాగానికి కేసు బదిలీ అవ్వడం.. పూర్తిస్థాయిలో విచారణ జరపకపోవడం.. సకాలంలో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేకపోవడంతో బెయిల్‌పై బయటకు వచ్చేశాడు.. ఇక, మళ్లీ 2016లోనే ఎక్సైజ్ పోలీసులు కెల్విన్‌ను మరోసారి అరెస్ట్ చేశారు.. ఈ విచారణ సమయంలోనే తీగ లాగితే డొంక కదిలినట్టు.. టాలీవుడ్ డ్రగ్స్ వ్యవమారం బయటపడింది.. సినీ ప్రముఖుల పేర్లను తెరపైకి తెచ్చింది. అయితే బోయిన్పల్లి కేసులో సీసీఎస్‌లోని నార్కోటిక్స్ విభాగం.. తాజాగా నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడం.. ఆ ఛార్జ్‌సీట్‌ను నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించడం జరిగిపోయాయి.. దీంతో.. ఈ నెల 11వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కెల్విన్‌కు సమన్లు జారీ చేసింది నాంపల్లి కోర్టు.
మరోవైపు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రంగంలోకి దిగిన ఈడీ.. ఇప్పటికే పూరీ జగన్నాథ్, చార్మీ, రకుల్ ప్రీత్ సింగ్‌ను ప్రశ్నించగా.. ఇవాళ నందును కూడా విచారణకు పిలిచింది.. ఇదే సమయంలో.. కెల్విన్‌ను కూడా ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు అధికారులు.. 8 గంటలకు పైగా కెల్విన్‌ను ప్రశ్నిస్తున్నారు.. విచారణలో కెల్విన్ నుంచి కీలకమైన అంశాలను రాబట్టినట్టుగా తెలుస్తోంది.. టాలీవుడ్ నటులకు డ్రగ్స్ సరఫరా వ్యవహారం.. కెల్విన్ బ్యాంకు అకౌంట్ కు పెద్ద మొత్తంలో నిధుల బదలాయింపుపై ప్రశ్నిస్తున్నారు.. కెల్విన్ అకౌంట్లోకి పెద్ద మొత్తంలో నిధులు వచ్చినట్లుగా గుర్తించిన ఈడీ.. 30 అకౌంట్ల ద్వారా కెల్విన్ బ్యాంక్ ఖాతాలోకి నిధులు వచ్చినట్టుగా చెబుతున్నారు.. కెల్విన్ ఇంటి నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్టు కూడా స్వాధీనం చేసుకున్న అధికారులు.. కెల్విన్ కు రెండు బ్యాంకు అకౌంట్లు ఉన్నట్లుగా గుర్తించారు.. ఇక, ఈ కేసులో కెల్విన్‌ను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందంటున్నారు.
Also Read
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!