Vinayakan: అసలు సీఎం ఎవరు.. అతను మంచి వ్యక్తి అని ఎవరు చెప్పారు.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vinayakan: సాధారణంగా ఒక సినీ సెలబ్రిటీ కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ మృతి చెందితే.. సోషల్ మీడియాలో రెండు మూడు రోజుల వరకు వారి గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. ఇక మాజీ సీఎం మృతి చెందితే.. దాదాపు వారం రోజుల వరకు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన సాధించిన విజయాలు.. ప్రజలకు ఆయన ఏం చేశాడు.. ? ఏ ఏ పార్టీలో పనిచేశాడు.. ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఈ మధ్యనే కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి రాజకీయ ప్రముఖులు, మలయాళ సినీతారలు సైతం సంతాపం వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వం సైతం ఆ మృతికి రెండు రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించింది.అయితే ఉమెన్ చాందీ మృతిపై మలయాళ కమెడియన్, విలన్ సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా నిలిచాడు. వినాయకన్.. ఈ పేరు తమిళ్, మలయాళ భాషల్లో గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. అంతెందుకు.. విశాల్ నటించిన పొగరు సినిమా చూశారా .. అందులో విలన్ గా నటించిన శ్రియా రెడీ వెనుక అక్కా అక్కా అంటూ కుంటికాలుతో తిరుగుతూ ఉంటాడు కదా .. అతనే వినాయకన్. విలన్ గా, కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇతగాడు.. ఉమెన్ చాందీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Rajamouli: కల్కి ఫస్ట్ గ్లింప్స్.. ఆ ఒక్కటి మిస్ అయ్యింది
Also Read
సోషల్ మీడియాలో లైవ్ చాట్ పెట్టి.. అసలు ఎవరు ఉమెన్ చాందీ అంటూ ప్రశ్నించాడు. ” ఉమెన్ చాందీ ఎవరు..మూడు రోజుల నుంచి ఎక్కడ చూసిన ఆయనే కనిపిస్తున్నాడు. అతని మరణం గురించి మీడియాలో విస్తృతంగా కవరేజీ రావడం చాలా విడ్డురంగా ఉంది. మనిషి అన్నాకా మరణించడా..? ఇలాంటి వార్తలపై ఫోకస్ పెడుతున్నారు ఎందుకు..? ఇలాంటి వార్తలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం మానుకోవాలి. అంతేకాకుండా ఆయన మంచి వ్యక్తి అని చూపిస్తున్నారు.. అది తప్పు.. ఎవరు చెప్పారు.. ఆయన మంచి వ్యక్తి” అని అంటూ విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అసలు వినాయకన్ .. ఎందుకు ఇలా అన్నాడు.. వారి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా.. ? అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Anaswara Rajan: చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. ‘అమ్ములు’ ఫస్ట్‌లుక్ వచ్చేసింది!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
-
Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్‌ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!