నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ నిర్వహించారు. నిన్న ( శుక్రవారం ) నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ బహిరంగ సభ, ర్యాలీ నిర్వహించింది. సభలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ సర్కార్ తో పాటు స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టి వారిపై విమర్శలు గుప్పించారు.
Also Read : Rinku Singh: రింకూ తప్పకుండా భారత్ తరఫున ఆడుతాడు
కాంగ్రెస్ నేతల విమర్శలకు మునుగోడు ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నల్గొండ కాంగ్రెస్ నేతలు సన్నాసులు… చవటలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని ఆయన మండిపడ్డారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక బ్రోకర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకట్ రెడ్డి ఉప ఎన్నికల్లో తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కోసం పనిచేశారు అంటూ తెలిపారు. కాంగ్రెస్ లో అందరూ సీఎంలే.. ఒక్కరూ కూడా ప్రజల్లో గెలవరు అంటూ వెల్లడించారు. కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ లు వేల ఎకరాల భూమితో పుట్టినరా అంటూ మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Also Read : Anni Manchi Sakunamule: యాక్షన్ మూవీ చేయాలని ఉంది: మాళవిక నాయర్
రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు జోకర్లుగా మారారు అంటూ BRS MLA సైదిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నేతలు పోటీ చేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ లు కూడా రావంటు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులకు సభ్యత, సంస్కారం లేదని సైదిరెడ్డి అన్నారు. వాళ్ళను ఓడించడానికి మేము అవసరం లేదు.. వాళ్ళే ఒడించుకుంటారు అని హుజుర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నాయకులు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు.. వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి కాంగ్రెస్ నేతలకు.. వాళ్లు కావాలని ఇల్లు కట్టుకోలేదు అని ఆయన ఆరోపించారు.
Also Read : MLA Bhupal Reddy : బస్తీమే సవాల్ కోమటిరెడ్డి.. బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందా..
రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నల్గొండ ప్రజలు నాలుక కోస్తారు అంటూ తుంగతుర్తి MLA గాదరి కిషోర్ మండిపడ్డారు. రేవంత్ ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో రేవంత్, ఉత్తమ్ పై విమర్శలు చేశారు అని గాదరి కిషోర్ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా అంటే పారిపోయిన దొంగ జానారెడ్డి అంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే విమర్శించారు. కాంగ్రెస్ నేతలది సొంత ఎజెండా.. BRS పార్టీది ప్రజల ఎజెండా అంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ వెల్లడించారు.