Nagarjunasagar: తెలుగు రాష్ట్రాల్లో మరో వివాదం… డ్యాం పై చల్లారని నీటి మంటలు
- గత కొంతకాలంగా తరచు వివాదాలకు కేరాఫ్ గా నాగార్జునసాగర్ డ్యాం..
- ఆంధ్రప్రదేశ్- తెలంగాణ ఇరిగేషన్ అధికారుల మధ్య జల ఘర్షణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjunasagar: తెలుగు రాష్ట్రాల్లో మరో వివాదం మొదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరిగేషన్ అధికారుల మధ్య మళ్లీ జల ఘర్షణ చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యాం వద్ద మీటర్ రీడింగ్ కోసం వెళ్లిన తెలంగాణ అధికారుల బృందాన్ని ఏపీ ఇరిగేషన్ అధికారులు అడ్డుకున్నారు. రైట్ కెనాల్ వద్ద తెలంగాణ అధికారులకు ఇక్కడేం పని అంటూ ప్రశ్నించారు. ఇక్కడికి రావద్దంటూ హుకుం జారీ చేశారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య ఈవిషయమై వాగ్వాదం జరిగింది. ఏపీ అధికారుల తీరుపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకి తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. కాగా.. డ్యామ్ నిర్మాణ సమయం నుండి తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ డ్యాం నిర్వాహన బాధ్యతలు చేపడుతుంది. అయితే.. గత కొంతకాలంగా తరచు వివాదాలకు నాగార్జునసాగర్ డ్యాం కేరాఫ్ గా మారిన విషయం తెలిసిందే.. గత ఏడాది (2023) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదం జరిగి రచ్చకు దారితీసింది. ఈనేపథ్యలో తెలంగాణలో రెండు వైపులా ఆయా ప్రభుత్వాలు భారీగా పోలీసులను మోహరించారు. డ్యాం వైపు ఎవరిని అనుమతించలేదు. నోఎంట్రీ బోర్డును సైతం ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్లీ జల వివాదం తలెత్తడంతో అటు ఏపీ, ఇటు తెలంగాణ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు చర్యలో భాగాంగా పోలీసులు భారీగా మోహరించారు.
Dulquer Salmaan : ఓవర్సీస్ లో వన్ ‘మిలియన్ భాస్కర్’
Also Read
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!