అందరి ఇళ్లల్లో సాధారణంగా.. కుక్కల్ని, పిల్లుల్ని, కోళ్లని, మరికొందరు రామ చిలుకల, పావురాళ్లను పెంచుకుంటారు. కానీ ఇక్కడ వెరైటీగా కాకిని పెంచుకుంటున్నారు. రోజు దానికి ఆహారం పెట్టి మరి పోషిస్తున్నారు. ప్రస్తుతం దానికి జబ్బు చేయడంతో ఆసుపత్రకి తీసుకు వచ్చి వైద్యం కూడా చేయిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Read Also: Horror: యువకుడిని కారు టాప్ పై ఉంచి.. 8 కిలోమీటర్లు లాక్కెళ్లిన డ్రైవర్..
పూర్తి వివరాల్లోకి వెళితే. నల్లగొండ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. దేవరకొండ పట్టణానికి చెందిన షేక్ యూసుఫ్ – సాఫియా కుటుంబంతో ఏడాది నుంచి ఓ కాకి ఉంటుంది. ఉదయం ఇంటికి వచ్చిన కాకి .. సాయంత్రం వరకు కుటుంబ సభ్యులతోనే ఉంటుందని షేక్ యూసుఫ్ కుటుంబ సభ్యులు తెలిపారు. రోజు అన్నం, చికెన్ ఆహారంగా ఇస్తున్నామని వెల్లడించారు. అయితే గత రెండు రోజులుగా ఆహారం తీసుకోవడం లేదని పశువుల ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు పరిక్షించి కాకి చికిత్స అందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
— Telugu Scribe (@TeluguScribe) October 29, 2025