Nagoba Jatara: వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర.. నిష్టగా నాగదేవునికి ప్రత్యేక పూజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagoba Jatara: అడవి బిడ్డల అద్భుత జాతర నాగోబా జాతర నేటి నుంచి ఘనంగా ప్రారంభంకానుంది. గంగాజలాభిషేకంతో ప్రారంభమయ్యే నాగోబా జాతర పుష్య మాసం అమావాస్య అర్ధరాత్రి లోకమంతా నలుపు రంగు పులుముకుంటే.. ఆదిలాబాద్‌లోని కేస్లాపూర్లో వెలుగుల వెలుగుల మధ్య జాతర ప్రారంభమవుతుంది. ఈజాతర చిమ్మ చీకట్లలో చల్లటి గాలుల మధ్య దట్టమైన అడవి పండగ వాతావరణంతో కళకళలాడుతుంది. నాగోబా జాతర తర తరాల సంప్రదాయంగా.. అడవిబిడ్డలు ఎంతో నిష్టగా నాగదేవునికి ప్రత్యేక పూజలు జరుపుతారు.
Read also: Modi Telangana Tour: తెలంగాణలో మోడీ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో గోండు తెగలకు చెందిన మెస్రం వంశస్థులు నిర్వహించే అతిపెద్ద గిరిజన జాతర. ఈ జాతర గిరిజనుల ఐక్యతను చాటుతుంది. అప్పటి వరకు ఒకరికొకరు పుట్టిన ఆదివాసీ, గోండు, కొలాం, పరదాస్, మెస్రం తెగలు ఈ జాతరలో ఒక్కటవుతారు. జాతరకు వారం రోజుల ముందే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి బండ్లపై ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌కు చేరుకుంటారు. అయితే.. ఈ ప్రయాణం కూడా అత్యంత నిష్టతో ప్రకృతితో మమేకమవుతూ సాగుతుంది. గంగాభిషేకంతో మొదలై.. ప్రజాదర్బార్, బ్యాటింగ్ వంటి ప్రధాన కార్యక్రమాలతో ఈ జాతర జరగనుంది.. ఈరోజు అమావాస్య కావడంతో.. అర్ధరాత్రి పవిత్ర గోదావరి నదీజలాల అభిషేకంతో ఈ జాతర ప్రారంభం కానుంది. ఉదయం పూట మర్రి చెట్ల నుంచి పూజ సామాగ్రిని సేకరిస్తారు. అక్కడి నుంచి మెస్రం వాసులు నాగోబా ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. ఈ పాదయాత్ర చూడటానికి రెండు కళ్లు చాలవు.
Read also: IT Rides in Aditya Homes: మూడవరోజు ఐటీ సోదాలు.. ఉద్యోగులపై చేయి చేసుకున్నారని ఆరోపణ
ఇది చాలా బాగా సాగుతుంది. ఏడు కావడిలో నెయ్యి, పుట్టతేనె, బెల్లం, గానుగ నూనె వంటి వాటిని ఉంచుకుని 125 గ్రామాల చుట్టూ కాలినడకన తిరుగుతుంటారు. గోదావరి నుంచి తెచ్చిన పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకుంటారు. పై ఆలయంలో మహాపూజ ప్రారంభమవుతుంది. తెల్లవారుజామున 12 గంటల నుంచి ఏడు గంటలపాటు నిరాటంకంగా సాగే గంగాభిషేకం ఎంతో శోభాయమానంగా సాగింది. మెస్రం ప్రజలు రాత్రంతా నాగదేవతకు పవిత్ర పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వరుసగా మూడు రోజుల పాటు జాతర కొనసాగనుంది. చివరి రోజు ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. దీనికి స్థానిక ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు హాజరుకానున్నారు. ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో కేంద్ర గిరిజన శాఖ మంత్రి, రాష్ట్ర మంత్రులు కూడా నాగోబా దర్శనానికి వచ్చే అవకాశం ఉంది. ఈ జాతర ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కొనసాగనుంది.
Women Missing Case: మహిళ మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!