Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్‌గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jabardasth Mahesh: ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత వెండితెరపై ‘రంగస్థలం’, ‘మహానటి’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన నటుడు మహేష్. రీసెంట్గా ‘సింగ్ గీతం’ సినిమాలోనూ నటించి అలరించిన ఈ కమెడియన్.. సడన్‌గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. తాను స్వయంగా నిజం చెప్పే వరకు తన గురించి ఎలాంటి వార్తలు రాయవద్దంటూ ఆయన నెటిజన్లను, మీడియాను కోరడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఆ వీడియోలో మహేష్ ఏమన్నాడంటే.. “లైఫ్ చాలా అన్‌ప్రెడిక్టబుల్ (ఊహించనిది). ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో ఎవరికీ తెలీదు. మనం బయట చూసే దాన్ని బట్టి ఏవేవో ఊహించుకుని బ్లైండ్‌గా నమ్మేయడం అస్సలు కరెక్ట్ కాదు. ముఖ్యంగా రిపోర్టర్స్, మీమర్స్.. నేను స్వయంగా వచ్చి అసలు నిజం చెప్పేవరకు మీరు అనుకున్నది ఏదీ రాయొద్దు, పోస్ట్ చేయొద్దు. త్వరలోనే పూర్తి వివరాలతో నేనే మీ ముందుకు వచ్చి అసలు నిజం చెబుతాను” అంటూ మహేష్ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మహేష్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారడంతో అసలు ఆయన వ్యక్తిగత జీవితంలో ఏమైనా జరిగిందా? అనే చర్చ స్టార్ట్ అయ్యింది.
Also Read
అయితే దీని వెనుక మరో కోణం కూడా ఉండొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు తమ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు లేదా సోషల్ మీడియా అకౌంట్ల ప్రమోషన్ కోసం.. ఏదో జరిగిపోతోంది, త్వరలో నిజం చెబుతాం అంటూ హైప్ క్రియేట్ చేయడం కామన్ అయిపోయిందని అంటున్నారు. తీరా కట్ చేస్తే అదంతా ఒక పబ్లిసిటీ స్టంట్ అని తేలుతోంది. మరి మహేష్ పెట్టిన వీడియో కూడా అలాంటి ఒక క్రేజీ మూవీ ప్రమోషనా? లేక నిజంగానే ఆయన లైఫ్‌లో ఏదైనా ట్విస్ట్ ఉందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!