Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐర్లాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాజయంపై భారత టీ20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్పందించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన అయ్యర్.. ఈ ఓటమి ఒక గొప్ప అనుభవమని, దీని నుండి జట్టు చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉందని తెలిపాడు. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో లయ తప్పడమే ఓటమికి ప్రధాన కారణమని అంగీకరించాడు.
“తొలి మ్యాచ్‌లోనే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం మంచి ప్రారంభమే అయినప్పటికీ.. ఫలితం నిరాశపరిచింది. మ్యాచ్ ఆరంభంలో మా బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేశారు. పిచ్ నుండి లభించిన స్వింగ్‌ను వాడుకుంటూ వికెట్లు తీశారు. మాకు అద్భుతమైన స్టార్ట్ దక్కింది. కానీ, మిడిల్ ఓవర్లలో బౌలింగ్ ఎగ్జిక్యూషన్ లో పూర్తిగా విఫలమయ్యాం. ఇక్కడి గ్రౌండ్ బౌండరీలు చాలా చిన్నవని తెలిసినప్పటికీ.. ఐర్లాండ్ బ్యాటర్లు స్ట్రెయిట్ షాట్లు ఆడేలా బంతులు వేశాం. ప్రత్యర్థికి లభించిన మంచి ఆరంభాన్ని బట్టి చూస్తే.. వారిని 140 పరుగులకే కట్టడి చేసి ఉంటే చేజ్ చేయడం సులువయ్యేది” అని అయ్యర్ విశ్లేషించాడు.
Also Read
- Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
సుదీర్ఘ విరామం తర్వాత జట్టు బరిలోకి దిగడం వల్ల ఆటగాళ్లలో లయ తప్పినట్లు అనిపించిందని, అయితే దీనిని ఒక సాకుగా చెప్పలేమని అన్నాడు. “క్రికెట్లో దేనినీ తేలికగా తీసుకోకూడదు. కేవలం మైదానంలోకి అడుగుపెట్టగానే మ్యాచ్‌లు గెలవలేం. ప్రతి క్షణం కష్టపడాలి, ప్రెజెంట్ లో బతకాలి. ప్రత్యర్థిని దెబ్బతీసే అవకాశం వచ్చినప్పుడు అస్సలు వదలకూడదు. ఈ ఓటమి మాకు ఒక గుణపాఠం” అని అయ్యర్ పేర్కొన్నాడు.
ఇదే సమయంలో గాయం నుండి కోలుకుని అద్భుతంగా బౌలింగ్ చేసిన హర్షిత్ రాణా, డొమెస్టిక్ సర్క్యూట్ నుండి తనకు బాగా తెలిసిన శివమ్ దూబే ప్రదర్శనలను అయ్యర్ అభినందించాడు. ఈ మ్యాచ్‌లో జరిగిన తప్పులను వీలైనంత త్వరగా మర్చిపోయి.. తదుపరి మ్యాచ్‌లో పూర్తి బలంతో, సరికొత్త వ్యూహాలతో పునరాగమనం చేస్తామని భారత కెప్టెన్ ధీమా వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు