Modi Telangana Tour: భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13న హైదరాబాద్ కు రానున్న ప్రధాని.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు. అయితే.. ఈ నెల 19న ఆయన తెలంగాణలో పర్యటించాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల ఆ షెడ్యూల్ రద్దయింది. జనవరి 19వ తేదీన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి శంకుస్థాపన కార్యక్రమాన్ని రద్దు చేసి షెడ్యూల్ మార్చారు. విశాఖ-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును సంక్రాంతి సందర్భంగా జనవరి 15న వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు.
Read also: IT Rides in Aditya Homes: మూడవరోజు ఐటీ సోదాలు.. ఉద్యోగులపై చేయి చేసుకున్నారని ఆరోపణ
ఇప్పుడు ఆయన తెలంగాణలో ఫిబ్రవరి 13న పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను పీఎంవో ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న బీజేపీ నాయకత్వం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ, ప్రభుత్వంలోని పెద్ద నేతలంతా వరుసగా తెలంగాణలో పర్యటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటన తేదీలు ఇప్పటికే ఖరారు కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా త్వరలో రాష్ట్రానికి రానున్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రతి నియోజకవర్గంలో పర్యటించేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసింది.
Women Missing Case: మహిళ మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు