CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస యాత్రలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే దసరా పండుగ నేపథ్యంలో యథావిధిగా నాగర్ కర్నూల్ జిల్లా సొంతూరు కొండారెడ్డిపల్లె, ఆ తర్వాత తన నియోజకవర్గం కొడంగల్ లో సీఎం పర్యటించిన సంగతి తెలిసిందే. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం తో పాటు మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు రేవంత్ రెడ్డి కొంగరకలాన్ చేరుకుంటారు. అక్కడ ఫాక్స్ కాన్ కంపెనీ పనుల పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. కాగా, 2023లో ఫాక్స్ కాన్ కంపెనీ తెలంగాణకు వచ్చింది.. కొంగరకలాన్ లో 250 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ కంపెనీని ఏర్పాటు చేయాలని ఫాక్స్ కాన్ నిర్ణయించింది. దాదాపు లక్ష మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఫాక్స్‌కాన్ సీఈవో యంగ్ లియు వెల్లడించారు.
Read also: Kishan Reddy: హైదరాబాద్ లో ఇది నాలుగో సంఘటన.. అయినా స్పందించరా..
కొడంగల్ పర్యటన అనంతరం నిన్న(ఆదివారం) మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న రేవంత్ నేరుగా బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా అందరితో గౌరవింపబడే వ్యక్తి దత్తాత్రేయ అన్నారు. అలయ్ బలయ్.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిందన్నారు. పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు.. అలయ్ బలయ్ స్ఫూర్తి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో.. రాజకీయ పార్టీలన్నీ ఒకే వేదిక మీదకు వచ్చే అవకాశం లేకుండే అన్నారు. అలయ్ బలయ్ తెలంగాణ సంప్రదాయాల వేదిక అని తెలిపారు. రాజకీయాలకు సంబంధం లేదన్నారు.
Minister Seethakka: దివ్యాంగులు ఆఫీసర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.. మెసేజ్ చేస్తే చాలు..