Minister Seethakka: దివ్యాంగులు ఆఫీసర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.. మెసేజ్ చేస్తే చాలు..
- తెలంగాణ వికలాంగుల జాబ్ పోర్టల్ ను ఆవిష్కరించిన మంత్రి సీతక్క..
- దివ్యాంగులు కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు..
- ఆన్లైన్ జాబ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుంటే చాలు..
- వారి అర్హతను బట్టి ఉద్యోగాలు వస్తాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka: తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. వికలాంగుల జాబ్ పోర్టల్ ను ఏర్పాటు చేసింది. దివ్వాంగులు ఆఫీసర్లు చుట్టూ తిరిగే పనిలేకుండా నేరుగా జాబ్ పోర్టల్ లో అప్లై చేసుకుంటే చాలని, వారి అర్హతను బట్టి ఉద్యోగం ఉంటుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. ఈ మేరకు సచివాలయంలో తెలంగాణ వికలాంగుల జాబ్ పోర్టల్ ను ఆవిష్కరించారు. మహిళా సంక్షేమ శాఖ డైరెక్టరెట్ హెల్ప్ లైన్ లో పదిమందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువ అన్నారు. ఇతర వర్గాల వర్గాల వారిలా ఫైట్ చేయాలంటే ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నాలని తెలిపారు. శారీరకంగా వచ్చే లోపం మన చేతిలో లేదన్నారు. పోషకాహార లోపం, ప్రమాదం వల్ల వికలాంగులుగా మారే ప్రమాదం వుందన్నారు. అందుకే వాళ్లకి ఉపాది అవకాశాలు కల్పించేందుకు ఆన్లైన్ జాబ్ పోర్టల్ ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు ఉద్యోగాల్లో వికలాంగులకు రిజర్వేషన్లు పాటించాలని తెలిపారు.
Read also: Telangana Liquor Sales: మనోళ్లు మామూలోళ్లు కాదు.. వెయ్యి కోట్ల మందు తాగేశారు..
Also Read
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
దివ్యాంగులు కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఆన్లైన్ జాబ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుంటే చాలు.. వారి అర్హతను బట్టి ఉద్యోగాలు వస్తాయని గుడ్ న్యూస్ చెప్పారు. అందుకోసమే పోస్టల్ లో అందుబాటులోకి తెచ్చామన్నారు. సంక్షేమ నిధుల్లో ఐదు శాతం దివ్యాంగులకు కేటాయిస్తున్నామన్నారు. ప్రైవేట్ జాబ్ లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రయత్నిస్తున్నామన్నారు. గతంలో ఒక శాతం ఉంటే దాన్ని నాలుగు శాతానికి పెంచెందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు పాటిస్తామన్నారు. డిసబిలిటీని దృష్టిలో పెట్టుకొని వారిని ముందుకు తీసుకురావడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. సంక్షేమము, విద్యా, ఉద్యోగ రంగంలో దివ్యాంగులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. దివ్యాంగుల పరికరాల కోసం ఈ ఏడాది బడ్జెట్లో 50 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. దివ్యాంగులు ఆఫీసర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. నేరుగా మాకే..మీ సమస్యలను షేర్ చేయొచ్చని తెలిపారు. మెసేజ్ పాస్ చేస్తే చాలు మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
Read also: Rajanna Sircilla: తాగి చిల్ అవ్వాలి గానీ.. ఛాలెంజ్ చేసి ప్రాణంతో చెలగాటం అవసరమా?
బ్యాక్ లాగ్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. చాల కాలంగా పెండింగ్ లో ఉన్న బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టామన్నారు. అవకాశాలను బట్టి ఏ రంగం మీద మక్కువగా ఉంటే ఆ రంగంలోకి వెళ్ళండి.. పని చేయండి అన్నారు. దివ్యాంగులు స్వయం ఉపాధి కోసం చేయూతనిస్తామని తెలిపారు. వారి శక్తిని బట్టి ఉపాధి అవకాశాలు అనిపిస్తామన్నారు. ఆన్లైన్ జాబ్ పోర్టల్ ప్రారంభించుకోవడం శుభ పరిణామం అన్నారు. ఎక్కడ ఉపాధి ఉందో అని కంపెనీల చుట్టూ తిరగకుండా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దాన్ని బట్టి కంపెనీలే మీకు ఉపాధి కల్పిస్తారని.. దివ్యాంగులంతా యూనిటీ గా ఉండాలన్నారు. మీరు ఎదుర్కొంటున్న సమస్యలను నివేదించండి అని తెలిపారు. ప్రజా ప్రభుత్వం కచ్చితంగా మీ సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. అనంతరం మహిళా శిశు సంక్షేమ డైరెక్టరేట్ కాల్ సెంటర్లో పదిమంది దివ్యాంగులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ను మంత్రి సీతక్క అందించారు. సుహాసిని -హెల్ప్ లైన్ అడ్మినిస్ట్రేటర్ , ఎం లక్ష్మీ -ఐ టి సూపర్వైజర్ , కాల్ ఆపరేటర్లుగా మామిడి లావణ్య , కే లలిత, పార్వతమ్మ , మేడిశ్రీకాంత్, కొన్దోజు నాగలక్ష్మి, ఎం. రజిత, సిహెచ్ సుమిత్ర, అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకున్నారు. శుభాకాంక్షలు తెలిపి.. మీరు అందరికీ స్ఫూర్తి అంటూ అభినందించారు.
పచ్చివి తింటే కడుపు నొప్పి.. మరి ఉడికించి తింటే..?
తాజావార్తలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?