అచ్చంపేట నియోజకవర్గంలో అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ‘నల్లమల డిక్లరేషన్’ను సైతం ఆవిష్కరించారు. ఈ డిక్లరేషన్ ద్వారా గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో పనులు చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం నల్లమల ప్రాంతం గురించి సీఎం ప్రసంగించారు. ఒకప్పుడు నల్లమల అంటే వెనుకబడిన ప్రాంతం. ఎవరో ఒక నాయకుడు వచ్చి అభివృద్ధి చేయాలని అనేవారని నాటి రోజులను సీఎం గుర్తు చేశారు. సీఎంగా ఇక్కడి నుంచి…
దేశానికి ఇందిరా గాంధీ లాంటి పౌరుషం ఉన్న ప్రధాని కావాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 50 ఏండ్ల తర్వాత కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో ఇందిరమ్మ ఉందన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో అమ్రాబాద్ మండలం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సీఎం ప్రారంభించారు.
తెలంగాణ గడ్డపై దశాబ్దాలుగా ఉన్న దున్నేవాడిదే భూమి నినాదాన్ని ఇందిరా సౌర గిరి జిల్లా వికాసం వంటి పథకాల ద్వారా చట్టాలుగా అమలు చేస్తున్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ప్రారంభ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు. తెలంగాణ గడ్డపై ఉన్న నినాదాలు చట్టాలుగా మారాలంటే మరో 20 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నారు.
2014 నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల బాలరాజును గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు అచ్చంపేట ఓటర్లు . నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న గువ్వల.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంగబలం, అర్దబలంతో పాటు అధికార యంత్రాంగాన్ని కూడా కనుసన్నల్లో పెట్టుకుని నియోజకవర్గంలో నియంతలా వ్యవహరించారన్న అభిప్రాయం ఉంది.
Nagarkurnool:కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై రాళ్ల దాడి జరిగింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
నాగర్ కర్నూల్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి.. ఎలక్షన్లు రాగానే ఆగం కావొద్దు అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ వాళ్లు, కరెంట్ ఇస్థలేరని కర్ణాటక రైతులు గద్వాల, కొడంగల్ లో ఆందోళన చేస్తున్నారు.
Off The Record: అచ్చంపేట బీఆర్ఎస్‌లో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా రాజకీయం నడుస్తోంది. తమ రాజకీయ ప్రయాణానికి అడుగడుగునా స్పీడ్ బ్రేకర్‌గా మారిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు టార్గెట్‌గా ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్ పావులు కదుపుతున్నారు. నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తూ… వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలవడం ఖాయమని చెప్పుకొస్తున్నారు. దీంతో అచ్చంపేట గులాబీ పార్టీ రెండు వర్గాలుగా చీలినట్లు కనిపిస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా జడ్పీ చైర్మన్ పీఠం… అచ్చంపేట నియోజకవర్గ…