Hyderabad Crime: ఆపద సమయంలో ఓ వ్యక్తి అండగా నిలిచాడు. అతడి వద్దకు సాయం కోసం వచ్చిన మరో వ్యక్తి రూ.10 వేలు అప్పు ఇచ్చాడు. కానీ అతను అప్పు తీసుతీసుకుని చాలా రోజులు అవుతుంది. అప్పు ఇచ్చిన వ్యక్తి తిరిగి ఇవ్వలని కోరాడు. ఇక డబ్బులు లేవని చెప్పినా వినలేదు. అంతటితో ఆగకుండా తనపై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో విసుగుచెందిన అప్పుతీసుకున్న వ్యక్తి అందరూ చూస్తుండగానే హతమార్చాడు.ఈ సంఘటన హైదరాబాద్ హైకోర్టు గేట్ నంబర్ 6 సమీపంలో జరిగింది.
Read also: Alwal News: అల్వాల్‌లో సాప్ట్‌వేర్ ఉద్యోగిని హల్ చల్.. కొత్తకారుతో భీభత్సం
మిథున్ అనే వ్యక్తి సులబ్ కాంప్లెక్స్ లో పని చేస్తున్నాడు. అతను అవసరాల దృష్ట్యా కొందరికి అప్పుఇచ్చి ఆదుకునేవాడు. హై కోర్టు సమీపంలో పండ్లు అమ్ముకునే అజాం అనే వ్యక్తి మిథున్ వద్దకు వెళ్లాడు. తను కష్టాల్లో వున్నానని చెప్పి 10వేల రూపాయలు అప్పు ఇవ్వాలని కోరాడు. దీంతో మిథున్ అతనికి డబ్బులు ఇచ్చాడు. అయితే డబ్బులు ఇచ్చి రోజులు గడుస్తున్న అజాం పట్టించుకోలేదు. డబ్బులు ఇచ్చిన మిథున్ తిరిగి ఇవ్వాలనే అడిగిన విషయంలో పలుమార్లు ఇద్దరికి గొడవ జరిగింది. అయితే అజాం.. మిథున్ ని చంపేందుకు ప్లాన్ వేశాడు. అజాం బావమరిదికి విషయం చెప్పి మిథున్ హత్యకు ప్లాన్ చేశాడు. రోజులాగే మిథున్ .. అజాం వద్దకు వచ్చాడు డబ్బుల ఇవ్వాలని కోరగా అజాం, తన బావమరిది , మిథున్ తో గొడవకు దిగారు. ఈ ఉదయం ఇద్దరూ కలిసి మిథున్ ను హత్య చేసి పారిపోయారు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయారు. ఘటనా స్థలికి చేరుకున్న చార్మినార్ పోలీసులు క్లూస్ టీం కేసు నమోదు చేసి ఆధారాలు సేకరిస్తున్నారు. మిథున్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీ కి తరలించారు.
Cyber Crime: మహిళలే టార్గెట్.. రోజుకు రూ.5 కోట్ల పైనే దోచేశాడు..!