Komatireddy Rajagopal Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నేడు స్పీకర్‌కు రాజీనామా లేఖను అందించనున్నారు. ఈనేపథ్యంలో.. అసెంబ్లీ మీడియా పాయింట్ లో రాజగోపాల్ రెడ్డీ మాట్లాడారు. కొందరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్వార్దం ఉంటే పార్టీకి రాజీనామా చేయనని స్పష్టం చేసారు. ఉప ఎన్నికలకు ఎవరు పోరు? నన్ను నమ్ముకున్న వల్ల కోసం రాజీనామా చేసా అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు. 60 యేండ్ల పోరాటం ఒక కుటుంబం కోసం కాదని విమర్శించారు.
read also: Mudragada Padmanabham:కోనసీమ పెద్దలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ
స్పీకర్ ఇవాళ అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి నేడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఈనేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి రాజీనామను స్పీకర్ ఆమోదిస్తే..? ఆరు నెలల లోపు మునుగోడు ఉప ఎన్నిక రావడం ఖాయమని తెలుస్తోంది. అయితే రాజీనామా స్పీకర్ తనకు అందిన వెంటనే ఆమోదిస్తారా? లేదా న్యాయ సలహా తీసుకుని ఆమోద ముద్ర వేస్తారా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.