Munugode By Election Results: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠంగా మారింది. రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం మారుతుంది. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నాల్గో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 26,343, బీజేపీ 25,730, కాంగ్రెస్ 8,200, బీఎస్సీ 907 ఓట్లు.. టీఆర్ఎస్‌కు 613 ఓట్ల ఆధిక్యం కాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామం లింగవానిగూడెంలో బీజేపీకి ఆధిక్యం కావడంతో.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సొంత గ్రామంలోనే బీజేపీ ఆధిక్యం రావడంతో చర్చకు దారితీస్తోంది. తన సొంత ఊరిలోనే బీజేపీ ఆధిక్యంలో రావడంతో.. కూసుకుంట్లపై సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి అడ్డాలోనే కసాయి జెండా ఎగరవేశామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే టీఆర్‌ఎస్ అభ్యర్థి తన సొంత ఊరిలోనే అభివృద్ధి చేయలేదనేది బీజేపీ ఆధిక్యంలోకి రావడమే నిదర్శనం అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
MLA Rasamayi Balakishan: అభివృద్ధి చేయని ఎమ్మల్యే మాకొద్దు.. రాజీనామా చేయాల్సిందే..
ఉదయం 8గంటలకు మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. టీఆర్ఎస్ కు నాలుగు ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ 228, బీజేపీ 224, బీఎస్సీ-10, ఇతరులకు 88 ఓట్లు పోల్ అయ్యాయి. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ కు 1192 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉంది. ఫస్ట్ రౌండ్ లో టీఆర్ఎస్ కు 6,096 ఓట్లు రాగా, బీజేపీకి 4904, కాంగ్రెస్‌కు 1877 ఓట్లు వచ్చాయి నియోజక వర్గంలో 2,41,855 ఓటర్లు ఉండగా.. అందులో సర్వీసు ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని ఈ ఉప ఎన్నికల్లో 2,25, 878 ఓట్లు పోలయ్యాయి. గతంలో ఎన్నడూలేని విధంగా 93.41శాతం పోలింగ్ నమోదైంది. భారీ స్థాయిలో ఓట్లు పోలైన నేపథ్యంలో కౌంటింగ్‌కు సంబంధించి ఎంత ఆలస్యం జరిగినా సాయంత్రం 4గంటల వరకు తుదిఫలితం వెల్లడి కానుంది. ఓట్ల లెక్కింపు మొదట్లో బీజేపీకి ఓట్లు వచ్చిన, రౌండ్ రౌండ్ కు టీఆర్‌ఎస్ ఆధిక్యం లోకి రావడం విశేషం.
Honey Trap: ఇంటికి పిలిపించి ఎఫైర్ అంటగట్టారు.. అడ్డంగా బుక్కయ్యారు