తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ నేతలతో కలిసి ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. జూమ్ మీటింగ్ లో పిసిసి (PCC) చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , ఇతర కీలక నేతలతో చర్చించారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులకు సీఎం దిశానిర్దేశం చేశారు. పార్టీలోని నాయకులందరూ విభేదాలు పక్కన పెట్టి సమిష్టిగా పనిచేస్తేనే విజయం సాధ్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.
KCR vs SIT: ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద హడావుడి.. సిట్ నోటీసుల హాజరుపై సస్పెన్స్!
చైర్మన్ , మేయర్ అభ్యర్థుల ఎంపిక విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ , మేయర్ అభ్యర్థులను ఇప్పుడే ప్రకటించవద్దని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితులను బట్టి అభ్యర్థులను ఖరారు చేయడం వల్ల పార్టీలో అసంతృప్తిని తగ్గించవచ్చని ఆయన భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా తన పాలనకు ప్రజా మద్దతు ఉందని నిరూపించుకోవాలని రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఈ సమీక్షా సమావేశంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, అభ్యర్థుల ఎంపిక కసరత్తు , ప్రచార సరళిపై విస్తృతంగా చర్చించారు.
Mana Shankara Vara Prasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్!