లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు అహ్మదాబాద్‌లోని రాజీవ్ గాంధీ భవన్‌లోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశం జరగనుంది. మాజీ పీసీసీ అధ్యక్షులు, గుజరాత్ పీసీసీ సీనియర్ నాయకులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.
ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి వచ్చారు. సాదాసీదాగా రైల్లో ఢిల్లీ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్‌లో మీనాక్షి నటరాజన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఆయన వెంట హర్కర వేణుగోపాల్, ఫహీం, రచమల్ల సిద్దేశ్వర్ సహా ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఏఐసీసీ కార్యదర్శి గాంధీభవన్‌కు చేరుకున్నారు. గాంధీభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం…